MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నీటి ఉపవాసంతో నిజంగా బరువు తగ్గుతారా..?

నీటి ఉపవాసంతో నిజంగా బరువు తగ్గుతారా..?

నీటి ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అందులో వెయిట్ లాస్ ఒకటి. అయితే ఈ ఉపవాసం ఒక నిర్ధిష్ట కాలమే ఉండాలని పోషకాహార నిపుణులు అంటున్నారు.  

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 22 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే శరీరంలో తగినంత నీరుండాలి. నీరు మనల్నిహైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉన్న విషాన్ని కూడా బయటకు పంపుతుంది. అయితే ఈ మధ్యకాలంలో జనాలు బరువు తగ్గేందుకని నీటి ఉపవాసం ఉంటున్నారు. అంటే ఈ ఉపవాసంలో నీటిని తప్ప మరే పదార్థాలను తినకూడదన్న మాట. 
 

28

నీటి ఉపవాసం అంటే ఏమిటి? 

నీటి ఉపవాసం అంటే కొన్ని రోజుల పాటు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం ఒక్క నీటిని మాత్రమే తాగుతారన్న మాట. ఈ రకమైన ఉపవాసం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేలా.. జీవన శైలి మెరుగ్గా ఉండేలా ప్రోత్సహిస్తుందని చాలా మంది నమ్ముతారు. 

38

నీటి ఉపవాసం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ ఉపవాసం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి గుండె రక్షించబడుతుంది. 
 

48

పలువురు పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ నీటి ఉపవాసం ఒక నిర్ధిష్ట సమయం వరకే ఉండాలి. అంటే 24 నుంచి 72 గంటల వరకు మాత్రమే ఉండాలన్న మాట. వైద్య పర్యవేక్షణ లేకుండా ఇంతకంటే ఎక్కువ గంటలు నీటి ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

58

పోయిన ఏడాది యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 8 రోజుల పాటు.. 12 మంది మధ్యవయస్కులను నీటి ఉపవాసం ఉంచారు. ఎనిమిది రోజుల తర్వాత వారిలో బరువు తగ్గడం, సీరం గ్లూకోజ్ గాఢత తగ్గడం, శరీర కూర్పులో మార్పులు, ఒత్తిడి తగ్గడం, నిర్జలీకరణం, పెరిగిన కెటోజెనిసిస్, హైపర్యూరిసెమియా, హైపోనాట్రేమియా వంటి స్థాయిలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. అయితే ఈ ఉపవాసం వల్ల శరీరంపై కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నప్పటికీ.. అలాగే ఎక్కువ కాలం ఈ ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అధ్యయనం అంచనా వేసింది. 
 

68

ఈ ఉపవాసం ఆటోఫాగీని కూడా ప్రోత్సహిస్తుందని అధ్యనాలు నిరూపించాయి. అంటే ఈ ప్రక్రియలో కణం విచ్చిన్నమై దాని సైటోప్లాజంలోని పాత లేదా దెబ్బతిన్న భాగాలను రీసైకిల్ చేస్తుంది. ఏదేమైనా నీటి ఉపవాసం పరిమితికి మించి ఉంటే కండరాల నష్టం, రక్తపోటులో హెచ్చు తగ్గులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. డయాబెటీస్ పేషెంట్లు, గౌట్, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ నీటి ఉపవాసం ఉండకపోవడమే మంచిది. 
 

78


నీటి ఉపవాసం బరువు తగ్గడానికి సహాయపడుతుందా? 

చాలా మంది బరువు తగ్గడానికనీ నీటి ఉపవాసం ఎక్కువ రోజులు ఉంటారు. ఈ నీటి ఉపవాసం వల్ల ప్రతిరోజూ ఒక కిలో వరకు తగ్గడం చాలా సులువు అని కొందరు పోషకాహార నిపుణులు అంటున్నారు. అలా అని మోతాదుకు మించి ఎక్కువ రోజులు నీటి ఉపవాసం ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది కండరాల నష్టానికి కారణమవుతుంది.  దీనికి బదులుగా అప్పుడప్పుడు ఈ ఉపవాసం ఉండటం వల్ల కూడా కేలరీలను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఫైనల్ గా ఈ నీటి ఉపవాసం చేయడం పూర్తిగా అనవసరమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. 
 

88

ఈ నీటి ఉపవాసం వల్ల మీరు డీహైడ్రేషన్ బారిన పడొచ్చు. ఎందుకుంటే మీ శరీరానికి అందే నీటిలో 20 నుంచి 30 శాతం వరకు మీరు తిని ఫుడ్ నుంచే అందుతుంది. ఇక ఎలాగో ఫుడ్ కు దూరంగా ఉంటారు కాబట్టి మీ బాడీ నిర్జలీకరణానికి గురవుతుంది. దీనివల్ల మలబద్దకం, తలనొప్పి, రక్తపోటు తగ్గడం, వికారం వంటి సమస్యలు వస్తాయి. నీటి ఉపవాసం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved