MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బొప్పాయి మొటిమలను తగ్గిస్తుందా?

బొప్పాయి మొటిమలను తగ్గిస్తుందా?

బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మన చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొంతమందికి ఎప్పుడూ చర్మ సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటిని పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటాయి. చర్మ సమస్యలను తొలగించడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ నే వాడక్కర్లేదు. కొన్ని నేచురల్ పదార్థాలను వాడినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో బొప్పాయి ఒకటి. అవును బొప్పాయి ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది. మనల్ని అందంగా మారుస్తుంది. అందుకోసమే చాలా మంది బాగా పండిన బొప్పాయిని ముఖానికి రుద్దుకుంటారు. నిజమేంటంటే.. బొప్పాయి  వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. బొప్పాయి మన ముఖంలో చేసే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

మెరిసేలా చేస్తుంది

మన శరీరానికి విటమిన్ సి చాలా చాలా అవసరం. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఈ విటమిన్ లోపిస్తే ముఖ చర్మం డల్ గా మారుతుంది. కాంతిని కోల్పోతుంది. కాగా బొప్పాయి విటమిన్ సి కి మంచి మూలం. అందుకే బొప్పాయిని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల కాంతి పెరుగుతుంది.
 

36

ఎక్స్ఫోలియెంట్

బొప్పాయి కూడా మంచి ఎక్స్ఫోలియెంట్ యే తెలుసా? అంటే ముఖంపై డ్యామేజ్ అయిన కణాలను తొలగించడానికి బొప్పాయి బాగా సహాయపడుతుంది. దీనికి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. అంటే బొప్పాయిని నేచురల్ స్క్రబ్ గా కూడా వాడుకోవచ్చన్న మాట.

46

మొటిమలు

బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల క్రమంగా మొటిమలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ముఖంపై ఓపెన్ హెయిర్ ఫోలికల్స్ ను క్లోజ్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో ముఖంపై మురికి ప్రేరిత మొటిమలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. 

56

తేమ

చర్మం తగినంత హైడ్రేటెడ్ గా లేకపోతే చర్మం పొడిబారి చాలా నీరసంగా కనిపిస్తుంది. అయితే బొప్పాయిఈ సమస్యలను కూడా నివారించడానికి సహాయపడుతుంది. బొప్పాయి మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
 

66

మృదుత్వం

చాలా మంది తమ చర్మం మృదువుగా ఉండాలని కోరుకుంటారు. కానీ దీనికి సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం. బొప్పాయి సహజంగా చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Recommended image2
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?
Recommended image3
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved