Angry: కోపంలో ముఖం ఎర్రగా ఎందుకు మారుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా?
తనకోపమే తనకు శత్రువు అని పెద్దలు చెబుతుంటారు. కోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని చెబుతుంటారు. అయితే కోపంగా ఉన్న సమయంలో ముఖం ఎర్రగా మారడాన్ని గమనించే ఉంటాం. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
- FB
- TW
- Linkdin
Follow Us

Angry
కోపం.. సర్వసాధారణమైన ఎమోషన్. కోపం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కోపం వచ్చిన మనుషులను చూస్తే భయంగా ఉంటుంది. కొందరి ముఖం ఎర్రబడుతుంది. ఇలా ముఖం ఎర్రగా మారడానికి శరీరంలో జరిగే రసాయన చర్యలే కారణమని మీకు తెలుసా.? దీనివెనకాల ఒక శాస్త్రీయ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
angry-emotion
కోపం, భయం వంటి భావోద్వానికి గురైన వెంటనే శరీరంలో అడ్రెనలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచి, రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. అడ్రెలిన్ ఎక్కువగా విడుదలైతే శరీరంలో ఒక్కసారిగా రక్తప్రరణ వేగం పెరుగుతుంది. దీంతో ముఖం, చెంపలు, చెవులు ఎర్రబడతాయి. కోపానికి గురైన వారిలో ముఖంపై ఉండే కాపిల్లరి అనే చిన్న రక్తనాళంలో రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంది.
కోపం వచ్చిన సమయంలో రక్తనాళాలు విస్తరించడం వల్ల ముఖం ఎర్రబడుతుంది. ఇది శరీరం తాత్కాలికంగా అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కోవడానికి చేసే చర్య. కోపంలో సింబథెటిక్ నర్వస్ సిస్టమ్ (Sympathetic Nervous System) యాక్టివ్ అవుతుంది. ఇది కూడా ముఖం ఎర్రబడడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కోపం తగ్గిన వెంటనే మళ్లీ చర్మం రంగు మాములు స్థితికి వచ్చేస్తుంది. అడ్రెనలిన్ స్థాయిలు తగ్గగానే ఎర్రదనం తగ్గుతుంది.
కోపం తగ్గాలంటే ఏం చేయాలి.?
అతి కోపం అనర్థాలకు దారి తీస్తుందని చిన్నప్పుడు చదువుకున్న పద్యాల్లో చదివే ఉంటాం. అయితే కోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కోపం వచ్చిన వెంటనే లోతుగా శ్వాస తీసుకోవాలి. దీంతో శరీరం రిలాక్స్ అవుతుంది. కోపంగా ఉన్న సమయంలో నీటిని తాగాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.