MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రోజూ బ్లాక్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

రోజూ బ్లాక్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

సీజన్లతో సంబంధం లేకుండా టీ ప్రియులు టీ ని ప్రతిరోజూ తాగుతూనే ఉంటారు. కానీ మిల్క్ టీని తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన ఆరోగ్యానికి విషం లాంటిది. కానీ బ్లాక్ టీ ఇలా కాదు. మిల్క్ టీకి బదులుగా బ్లాక్ టీని తాగితే ఏమౌతుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 23 2024, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


టీ రకాలలో బ్లాక్ టీ ఒకటి. ఈ బ్లాక్ టీలో గ్రీన్ టీ, పసుపు టీ లేదా వైట్ టీ కంటే టీ ఆకులు ఎక్కువగా ఆక్సీకరణం చెందుతాయి. అందుకే ఇది ఇతర టీ లకంటే బలంగా ఉంటుంది. అలాగే మంచి ప్రాచుర్యం కూడా పొందింది. నిజానికి బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరాన్ని ఎన్నో వ్యాధులు కలిగించే వైరస్ లనునంచి కాపాడుతుంది. అసలు రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26

బ్లాక్ టీ లో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మం దెబ్బతినకుండా కాపాడుతాయి. అలాగే వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి కూడా సహాయపడతాయి. బ్లాక్ టీలో ఉండే కాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

36
hot black tea

hot black tea

బ్లాక్ టీ తాగితే కొరోనరీ ఆర్టరీ పనితీరును మెరుగుపడుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు రావు. బ్లాక్ టీ పేగు సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీ ఇరుగ్గా ఉండే  గాలి గొట్టాన్ని తెరుస్తుంది. అలాగే ఇది శ్వాసను సులభతరం చేస్తుంది. బ్లాక్ టీ ఉబ్బసంతో బాధపడేవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

46
Image: Getty Images

Image: Getty Images


బ్లాక్ టీ తాగితే జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది ప్రీ మెనోపాజ్ సమయంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా బ్లాక్ టీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రేడియేషన్ బహిర్గతం వల్ల కలిగే చర్మ నష్టాన్ని సరిచేయడానికి కూడా సహాయపడుతుంది.
 

56

బ్లాక్ టీ మన నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఇది మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
 

66
black tea

black tea

బ్లాక్ టీ మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అలాగే బరువు పెరగకుండా కాపాడుతుంది. బ్లాక్ టీలో థియోఫ్లేవిన్స్, థిరోబిగిన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లాక్ టీ ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి, ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇది డిప్రెషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. బ్లాక్ టీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Fibar Food: ఫైబర్ తింటే ఆరోగ్యమేనా? ఈ సమస్య ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
Recommended image2
రోజూ రెండు లవంగాలు నమిలితే ఏమౌతుంది?
Recommended image3
అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved