ప్రపంచంలో నోటి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే ఏకైక ప్రాణి ఏదో తెలుసా.?
ఎన్నో రకాల ప్రాణులకు నెలకు మన భూమి నెలవు. భూమిపై వింత వింత జంతువులు ఉన్నాయి. ఇక ప్రతీ జీవి పునరుత్పత్వి వ్యవస్థను కలిగి ఉంటుందని తెలిసిందే. మరో జీవికి జన్మనిచ్చే క్రమంలో ఒక్కో జీవికి ఒక్కో ప్రక్రియ ఉంటుంది. అయితే నోటి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే ప్రాణి కూడా ఉందని మీకు తెలుసా.?

మనుషులతో పాటు ఈ భూమ్మీద ఎన్నో రకాల ప్రాణాలు జీవిస్తుంటాయి. అన్ని జీవుల భౌతిక నిర్మాణం భిన్నంగా ఉంటాయి. అలాగే వాటి పునరుత్పత్తి వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాణులు గుడ్ల ద్వారా బిడ్డలకు జన్మనిస్తే, మరికొన్ని నేరుగా ప్రాణికి జీవం పోస్తాయి. అయితే నటి ద్వారా బిడ్డకు జన్మనిచ్చే ఓ జీవి ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా జీవి.? దాని పునరుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
కప్పలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా కప్పలు గుడ్లను ఆకులపై, నీటిలో పొదుగుతుంటాయి. అయితే ఓ కప్ప మాత్రం గుడ్లను పొదిగేందుకు దాని నోటిని ఉపయోగిస్తుంది. ఆ కప్ప పేరే గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ కప్ప. ఇది పిల్లలకు జన్మనిచ్చే పద్ధతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ కప్పులు గుడ్లను పెట్టిన వెంటనే ముందుగా మింగేస్తాయి. అయితే ఈ గుడ్లపై ఉండే ప్రత్యేక రసాయన పొర వాటిని పొట్టలోని గ్యాస్ట్రిక్ యాసిడ్ నుంచి రక్షిస్తుంది.
ఈ గుడ్లు పొదిగే వరకు కడుపులోనే ఉంటాయి. పొదిగిన తర్వాత కప్ప పిల్లలు నోటి నుంచి బయవకు వస్తాయి. ఈ కప్పులు ఒకేసారి ఏకంగా 25 పిల్లలకు జన్మనిస్తాయి. అయితే ఈ రకమైన కప్పలు 1980లోనే అంతరించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని ఒక చిన్న ప్రాంతంలో ఈ కప్పను గుర్తించారు. ఇలా ప్రపంచంలో నోటి ద్వారా పిల్లలకు జన్మనిచ్చే ఏకైక కప్పగా గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ కప్ప నిలిచింది.