- Home
- Life
- Nita Ambani: నీతా అంబానీకి ఒక్కసారి మేకప్ ఖర్చు ఎంతో తెలుసా? ఎంతో మంది నెల జీతం కన్నా ఎక్కువ
Nita Ambani: నీతా అంబానీకి ఒక్కసారి మేకప్ ఖర్చు ఎంతో తెలుసా? ఎంతో మంది నెల జీతం కన్నా ఎక్కువ
Nita Ambani: నీతా అంబానీ ఎంతో అందంగా ఉంటారు. ఆవిడ మేకప్ కూడా ఎలిగెంట్ గా ఉంటుంది. నీతా అంబానీకి మేకప్ వేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఒక్కసారి ఆమెకు మేకప్ వేస్తే చాలు సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్టుల పంట పండినట్టే.

నీతా అంబానీ మేకప్ ఖర్చు ఎంత?
నీతా అంబానీ సహా అంబానీ ఫ్యామిలీ మేకప్, హెయిర్ స్టైలింగ్ చూసుకునే ఫేమస్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఓజాస్ రజానీ. ముంబైకి చెందిన ఓజాస్ రజానీకి బ్యూటీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. నీతా అంబానీకి మాత్రమే కాదు, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్లకు కూడా స్పెషల్ ఈవెంట్స్, గ్రాండ్ ఫంక్షన్లలో మేకప్, స్టైలింగ్ చేసింది ఈమెనే.
రిపోర్ట్స్ ప్రకారం.. ఓజాస్ రజానీ బ్రైడల్, పార్టీ మేకప్ ప్యాకేజీల ఫీజు దాదాపు రూ.1 లక్ష వరకు ఉంటుంది. ఇందులో కేవలం ముఖానికి మేకప్ వేయడమే కాదు.. హై డెఫినిషన్ (HD) మేకప్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ ఎక్స్టెన్షన్, శారీ డ్రేపింగ్ లాంటి కంప్లీట్ లుక్ రెడీ చేసే సర్వీసులు కూడా ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్స్‌కి ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్
ఓజాస్ రజానీ నీతా అంబానీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, దివంగత నటి శ్రీదేవికి కూడా మేకప్ చేశారు. అంతేకాదు, మరియా కారీ, బ్రిట్నీ స్పియర్స్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్‌తో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆమె సొంతం.
విదేశాల్లో ట్రైనింగ్, ముంబైలో సొంత అకాడమీ
ఓజాస్ రజానీ అమెరికాలోని మయామి స్కూల్ ఆఫ్ హెయిర్ అండ్ మేకప్‌లో ట్రైనింగ్ తీసుకున్నారని సమాచారం. ముంబైలోని బాంద్రాలో సొంతంగా హెయిర్ అండ్ మేకప్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు. మూడు దశాబ్దాల ఎక్స్పీరియన్స్, సెలబ్రిటీలతో పనిచేసిన నైపుణ్యం ఆమెకు బ్యూటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
కామన్ పీపుల్స్కి ఒక మేకప్ సెషన్‌కు రూ.1 లక్ష అంటే పెద్ద అమౌంటే. కానీ సెలబ్రిటీల ప్రపంచంలో పర్ఫెక్ట్ లుక్, పర్సనల్ స్టైలింగ్‌కు ఎంత క్రేజ్ ఉందో ఓజాస్ రజానీ ఫీజు చూస్తే అర్థమవుతుంది.













