ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదా..? కారణం ఇదే కావొచ్చు..
Habits: కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటేనే మనం సేఫ్.. మన డబ్బూ సేఫ్. అదే ఉండకూడని అలవాట్లుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితిపై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. వాటితో మీ నెల జీతమంతా కొద్ది కాలంలోనే మాయమవుతుంది.

Habits: డబ్బులు సంపాదించడం గొప్ప కాదు.. వాటిని పోగు చేయడం గొప్ప. కొంతమంది గొడ్డులాగ కష్టించి డబ్బులు సంపాదిస్తారు. అయినా వారి దగ్గర నెలాఖరు వరకు ఒక్క పైసా కూడా మిగలదు. అలాంటి వారు మేము ఎన్ని డబ్బులు సంపాదించినా దండగే.. అని విధిని తిట్టిపోస్తూ ఉంటారు. దానికి కారణం విధో లేక మరో కారణమో కాదు. మీరు.. అవును మీకున్న కొన్ని అలవాట్ల వల్లే అలా జరుగుతూ ఉంటుంది. మీకున్న ఈ అలవాట్లను మార్చుకుంటే మీరు సంపన్నులు అవుతారు. ఇందుకోసం మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్ లైన్ షాపింగ్ : ప్రస్తుతం ఆఫ్ లైన్ షాపింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ లే ఎక్కువగా చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, యూపీఐ ఉన్న ప్రతి ఒక్కళ్లూ ఈ ఆన్ లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. రోజుకు కొంచెం సమయం దొరికితే చాలు ఈ కామర్స్ సైట్లు తెరిచి దాంట్లో ఏదైనా నచ్చితే చాలు ఆర్డర్ చేసేస్తుంటారు. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు కానీ.. తరచుగా ఈ ఆన్ లైన్ షాపింగ్ చేస్తే మీ జేబుకు చిల్లు పడటం పక్కా. భవిష్యత్తుల్లో ఎన్నో అవసరాలుంటాయి. అంతదాకా ఎందుకు రేపే మీకు ఏదైనా సమస్య వచ్చి డబ్బులు అవసరపడొచ్చు. కాబట్టి మీరు ఈ అనవసర ఖర్చును తగ్గించుకోవాలి. అందుకోసం మీరు ముందుగా చేయాల్సిన పని ఈ కామర్స్ సైట్లను డిలీట్ చేయడం. సమయం దొరికతే ఇష్టమైన పాటలు విననడమో, బుక్కులు చదవడమో చేయండి.
phone
క్యాబ్ బుకింగ్ లు: బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించేందుకు కొంతమంది ఇంట్రెస్ట్ చూపడం లేదు. చిన్న నుంచి దూర ప్రయాణాల వరకు క్యాబ్ లనో, ఆటోలనో బుక్ చేసుకుని సపరేట్ గా అందులోనే వెళుతుంటారు. వీటికి డబుల్ , త్రిబుల్ అమౌంట్ పడుతుందని మీకూ తెలుసు. కాబట్టి వీటిని అనవసరంగా మీ కష్టార్జితాన్ని ధారపోయకండి. వీటిల్లో వెల్లకుంటేనే మీ డబ్బులు మిగులుతాయి. లేదంటే మీ నెల జీతమంతా వీటికే ఖర్చైపోతుంది.
ఆల్కహాల్, స్మోకింగ్: ఇవి మహా చెడ్డ అలవాట్లు. దీనివల్ల వల్ల మీకు వచ్చేది ఏది ఉండదు. పైగా ఈ అలవాట్ల వల్ల మీ డబ్బులు బొక్క, మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందులోనూ ప్రస్తుతం వీటిరేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మీకు తెలుసో తెలియదో.. ఇంట్లో ఏ ఒక్కరికైనా మద్యం తాగే అలవాటున్నా.. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గకుండా ఉండాలంటే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లను మానుకోకతప్పదు.
బయట తినడం: అప్పుడప్పుడు బయట రుచులను ఆస్వాదించడం తప్పేంలేదు. ఒకరకంగా బయట తినడం వల్ల ఇంట్లో ఫుడ్ విలువ కూడా తెలుస్తుంది. కానీ అదే పనిగా తరచుగా బయట తింటే మాత్రం మీ జేబుకు చిల్లులు పడటం పక్కా. అంతేకాదు వీటిని తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీకు తెలుసా.. ఆన్ లైన్ లో, రెస్టారెంట్లలో తినడం వల్ల ఎక్కువ ఖర్చవుతుంది. వీటిని తినడం వల్ల మీ డబ్బు అనవసరంగా వృధా అవుతుంది. కాబట్టి బయట ఫుడ్ ను తినడం తగ్గించడం. అప్పడు మీ ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.