MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • నెలసరి సమయంలో గుడ్లు తినొచ్చా? లేదా?

నెలసరి సమయంలో గుడ్లు తినొచ్చా? లేదా?

నెలసరి సమయంలో మహిళలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఆ సమయంలో ఉండే.. నొప్పిని, వికారం వంటి సమస్యలు తీవ్రతరమయ్యే ప్రమాదముంది. అయితే పీరియడ్స్ సమయంలో కోడి గుడ్డును తినొచ్చా?లేదా? అంటూ చాలా మంది అపోహలు పడుతుంటారు. ఇంతకీ ఆ టైం లో గుడ్డును తీసుకోవాలా లేదా అనేది దానిపై నిపుణులు ఏమంటున్నారంటే..

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 06 2022, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

పీరియడ్స్ సమయం ప్రతి మహిళలకు సున్నితమైన దశ. ఈ సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, వెన్ను నొప్పి, వికారం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా ఆ సమయంలో వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే .. వాటి వల్ల ఆ నొప్పి మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా తిమ్మిరిని మరింత ఎక్కువ చేస్తాయి.

25
Asianet Image

గర్భిణులు గానీ, నెలసరి సమస్యను ఎదుర్కొనే ఆడవారు గానీ ఆ సమయంలో ఎక్కువగా గుడ్లను తినడానికి ఇష్టపడుతుంటారు.  ఎందుకంటే ఆ సమయంలో వారు ఈజీగా అయ్యే వంటలనే చేసుకుని తింటూ ఉంటారు. అందులో గుడ్డుతో చేసే ఆహారం చాలా తొందరగా అవుతుంది. అయితే కొంత మంది పీరియడ్స్ టైంలో గుడ్లు తినకూడదని చెబుతూ ఉంటారు. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
 

35
Asianet Image

గుడ్డులో విటమిన్లు B6, D, E పుష్కలంగా లభిస్తాయి. కాగా గుడ్లను తినడం వల్ల మనకు PMS లక్షణాలతో పోరాడగల శక్తి లభిస్తుంది. అంతేకాదు వీటిల్లో ప్రోటీన్లు పష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. అంతేకాదు గుడ్డులో క్యాల్షియం, భాస్వరం మెండుగా లభిస్తాయి. వీటి వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే వీటిలో ఉండే జింక్ వల్ల మన రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఒక్క గుడ్డు ద్వారా మనకు 125.5 మిల్లీగ్రాముల Colin అందుతుంది. ఇది మన మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.  అంతేకాదు గుడ్డును తినడం వల్ల HDL levels పెరుగుతాయి. అయితే చాలా మంది గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని అపోహ పడిపోతుంటారు. నిజానికి గుడ్లను Moderate size లో తీసుకుంటే హార్ట్ స్ట్రోక్,  హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి రోగాలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 
 

45
Asianet Image


జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి కూడా ఉడకబెట్టిన గుడ్లు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించంలో ఈ గుడ్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. కోడిగుడ్డులో ఐరన్ మెండుగా లభిస్తుంది. అంతేకాదు ఈ ఐరన్ ను మన శరీరం చాలా ఫాస్ట్ గా గ్రహిస్తుంది. కాబట్టి గర్భిణులకు, బాలింతలకు క్రమం తప్పకుండా ఉడకబెట్టిన గుడ్డును పెట్టాలి. కళ్ల ఆరోగ్యానికి కూడా గుడ్డు ఎంతో సహాయపడుతుంది. గుడ్లలో ఉండే క్యాల్షియం, పొటాషియం బోన్స్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. 
 

55
Asianet Image

నరాల బలహీనతతో బాధపడేవారికి గుడ్డు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాదు గుండె సంబంధిత సమస్యల నివారణకు కూడా ఈ గుడ్డు ఎంతో తోడ్పడుతుంది. వారానికి ఆరు గుడ్లను తప్పని సరిగా తినే ఆడవారికి 44 శాతం రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయానాలు తేల్చి చెప్పాయి. గుడ్డును ఉడికించి తిన్నా.. ఆమ్లేట్ వేసుకుని తిన్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి పీరియడ్స్ ఉన్న సమయంలో కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా గుడ్లను బేషుగ్గా తినండి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved