అపోహలు - నిజాలు : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదా?
కరోనా టీకాల వల్ల గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని చాలామందిలో ఈమధ్య కొత్తరకం అపోహ మొదలయ్యింది. దీన్ని వైద్య నిపుణులు తేలిగ్గా కొట్టిపడేశారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనాన్ని కూడా...చెప్పుకొచ్చారు. ఫైజర్ చేసిన ఓ అధ్యయనంలో, డమ్మీ షాట్‌లు ఇచ్చిన గ్రూపులోని మహిళలు, అసలు టీకా తీసుకున్న గ్రూపులోని మహిళలు కూడా అదే సంఖ్యలో గర్భవతులు అయ్యారు.
కోవిడ్ టీకాల మీద రకరకాల అపోహలు, అనుమానాలు ఇంకా అనేకం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటే.. కోవిడ్ టీకా వేసుకోవడం వల్లస్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం చూపుతుందనే అపోహ. అయితే దీనికి ఎలాంటి ఆధారం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లతో సహా ఏవైనా వ్యాక్సిన్‌లు గర్భవతి అయ్యే అవకాశాలను ప్రభావితం చేస్తాయనడానికి ఎలాంటి ఆధారం లేదని కూడా తేల్చేశారు.
కరోనా టీకాల వల్ల గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని చాలామందిలో ఈమధ్య కొత్తరకం అపోహ మొదలయ్యింది. దీన్ని వైద్య నిపుణులు తేలిగ్గా కొట్టిపడేశారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనాన్ని కూడా...చెప్పుకొచ్చారు. ఫైజర్ చేసిన ఓ అధ్యయనంలో, డమ్మీ షాట్‌లు ఇచ్చిన గ్రూపులోని మహిళలు, అసలు టీకా తీసుకున్న గ్రూపులోని మహిళలు కూడా అదే సంఖ్యలో గర్భవతులు అయ్యారు.
pregnant
అయితే వ్యాక్సినేషన్ తరువాత నెలవారీ పీరియడ్‌లలో స్వల్పకాలిక మార్పులు వస్తున్న విషయాన్నీ వీరు పరిగణలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదికలను పరిశోధకులు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు, అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల సంతానోత్పత్తికి ప్రమాదం కలిగించే సూచనలు ఏమ లేవని యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ మేరీ జేన్ మింకిన్ అన్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ప్రసూతి వైద్య బృందాలు కూడా గర్భిణీలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు వేయాలని సిఫార్సు చేస్తున్నాయి, వారికి కరోనావైరస్ సోకినట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. వైరస్ సోకిన గర్భిణులు ఇంటెన్సివ్ కేర్‌లో చేరడం, ఇన్వాసివ్ వెంటిలేషన్ పొందడం అవసరం అవుతున్నాయన్నారు. అంతేకాదు వైరస్ బారిన పడిన మామూల మహిళలతో పోల్చితే వైరస్ బారిన పడిన గర్భవతులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
CDC కూడా వేలాది మంది గర్భిణీ స్త్రీలను పరిశీలించింది. వ్యాక్సిన్ తీసుకున్న గర్భిణులు ఎదుర్కున్న ఆరోగ్య సమస్యల మీద పనిచేసింది. వ్యాక్సినేషన్ తీసుకున్న గర్భిణీలు కరోనా మహమ్మారి విరుచుకుపడే ముందు గర్భిణీలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో అలాంటివే ఎదుర్కున్నారని తేలింది. అంతేకాదు వైరస్ బారిన పడిన మామూల మహిళలతో పోల్చితే వైరస్ బారిన పడిన గర్భవతులు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రెగ్నెన్సీ, డెలివరీలాంటి వాటి విషయం గురించి ఆలోచిస్తున్నట్లైతే వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవడం అవసరం అని ఎమోరీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో గైనకాలజీ అండ్ ప్రసూతి విభాగ ఛైర్మన్ డాక్టర్ డెనిస్ జమీసన్ చెప్పారు. కాబట్టి గర్భిణులు... కొత్తగా తల్లికావాలనుకుంటున్న స్త్రీలు వెంటనే వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల అనేక కాంప్లికేషన్స్ నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు.