MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇకపై పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లను వాడకండి.. నొప్పికి మందులు కిచెన్ లోనే ఉన్నయ్..

ఇకపై పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లను వాడకండి.. నొప్పికి మందులు కిచెన్ లోనే ఉన్నయ్..

ఒళ్లు నొప్పులుగా ఉందని తరచుగా పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారా? ఇకపై అలా చేయకండి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. మరి ఈ నొప్పులు ఎలా తగ్గేదంటారేమో.. వీటికి మన వంటిళ్లు ఉంది కదా..

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 21 2022, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల వాడకం బాగా పెరిగింది. కొంచెం నొప్పిగా అనిపిస్తే చాలు ఆలస్యం చేయకుండా ఈ ట్యాబ్లెట్ ను మింగుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పిప్పర్ మెంట్ గోలీలలాగే ఈ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లను వాడుతున్నారట. వాస్తవానికి ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల వాడకం వల్ల ఆరోగ్యం కన్నా.. అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.

26

అందుకే ఈ మందు బిల్లల కంటే మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ నొప్పిని వదిలించుకోవచ్చు. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే ఉండదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు.  Inflammation, నొప్పి, Blotting సమస్యలకు పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లనే వేసుకోవాలని ఏం లేదు. వీటన్నింటినీ తగ్గించడంలో పెరుగు మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే పెరుగులో ఆరోగ్యకరమైన Probiotics మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి రోజుకు రెండు నుంచి మూడు సార్లు పెరుగు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

36

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, పొత్తి కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో పెరుగు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అలాగే పుదీనా ఆకులతో తలనొప్పి, కండరాల నొన్ని, నరాల నొప్పి, పంటి నొప్పి వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. ముఖ్యంగా అజీర్థి సమస్యతో బాధపడేవారే కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల దాన్నుంచి బయటపడతారు.
 

46

ఇంతేకాదు పుదీనా ఆకులను నమలడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ పుదీనాలో ఉండే థెరపిటిక్ ప్రాపర్టీస్ నరాలు, కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే తీపులు, ఒంటి నొప్పులు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల్లో పది నుంచి పన్నెండు పుదీనా ఆయిల్ చుక్కలను వేయాలి. వాటితో స్నానం చేయాలి.
 

56

అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పి, కండరాల నొప్పి, నెలసరిలో వచ్చే కడుపు నొప్పి, ఆర్థరైటిస్, ఛాతి నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడేవారు కొంచెం అల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తే మేలు జరుగుతుంది. అల్లం టీ తాగడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని పలు అధ్యయనాలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి 

66

యాపిల్ సిడర్ వెనిగర్ తో కండరాల నొప్పులు, డీహైడ్రేషన్, తీపుల వంటి సమస్యలు దూరమవుతాయి. ఎందుకంటే ఇందులో పోషకవిలువలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మన బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ గా ఉండేందుకు సహాయపడతాయి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో టీ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ను కలిపి ప్రతిరోజూ ఒక సారి తాగడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Recommended image2
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?
Recommended image3
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved