పరిగడుపున వీటిని మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకండి.. లేదంటే..?
కొన్ని రకాల ఆహార పదార్థాలను ఉదయం ఖాళీ కడుపున అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే..

కాఫీ.. కాఫీతోనే రోజును ప్రారంభించేవాళ్లు చాలా మందే ఉన్నారు. కాఫీ తాగాకనే బెడ్ దిగుతుంటారు. కెఫిన్ తాగడం వల్ల అప్పటికీ హెల్త్ బాగున్నప్పటికీ.. పరిగడుపున కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మసాలాలు.. బ్రేక్ ఫాస్ట్ లో లేదా పరిగడుపున మసాలా ఫుడ్ ను తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇలా తీసుకుంటే ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్.. ఖాళీ కడుపున కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాబ్లెట్స్.. పరిగడుపున యాంటీ ఇన్ ఫ్లమేటరీ మందు బిల్లలను మింగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వేసుకుంటే ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చంటున్నారు.
చీజ్.. ఖాళీ కడుపున ఐస్ క్రీమ్ లేదా చీజ్ ను అస్సలు తినకూడదట. ముఖ్యంగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే, కొవ్వు పదర్థాలు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలను తీసుకుంటే అజీర్థ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి తీసుకోండి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే గ్రీన్ టీ లేదా.. నిమ్మరసం తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటాయి. వీటివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
తులసి.. తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ పరిగడుపున నాలుగైదు తులసి ఆకులను నమిలితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.
వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగుతుంది. అలాగే జీర్ణసమస్యలు కూడా ఇట్టే తగ్గిపోతాయి.