Sanitizers : శానిటైజర్ వాడకంలో ఈ జాగ్రత్తలు అస్సలు మరువకండి.. ఎందుకంటే.?
Sanitizers : కరోనా రాకతో శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీనిని వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతే మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Sanitizers : కరోనా రాకతో ప్రజల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పెరిగింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఫాలో అవుతూ సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం,. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి ఉండాలని సూచిస్తున్నారు.
మాస్కులు ధరించడం, తరచుగా చేతులను తరచుగా క్లీన్ గా చేసుకోవడం.. ఇవన్నీ మన జీవితంలోకి కొత్తగా వచ్చినవే. అయినా ఇవి మనం తప్పకుండా పాటించాల్సిన రూల్స్ లా మారాయి. ఎందుకంటే ఇవే మనల్ని వైరస్ బారిన పడకుండా చేసే బ్రహ్మాస్త్రాలు కాబట్టి. అయితే చేతులను శుభ్రపరచుకోవడానికి శానిటైజర్లనే ఎక్కువగా వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అందుకే ప్రస్తుత కాలంలో శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరిగింది. వీటిని వాడటం వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు, వైరస్ ను నశిస్తాయి. అందుకే జనాలు వీటిని విపరీతంగా వాడుతున్నారు.
శానిటైజర్ల వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. అన్ని నష్టాలు కూడా జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటి వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకొవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
మనం వాడే శానిటైజర్లలలో 60-90 శాతం ఆల్కహాల్ తో తయారవుతుంది. దీనిని వాడిప్పుడు స్టవ్ దగ్గరకు అస్సలు వెళ్లకూడదు. ఎందుకంటే చేతులకు మంట అంటుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్కహాల్ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే శానిటైజర్లను చేతులకు పెట్టుకున్నప్పుడు వెంటనే కాకుండా అది పూర్తిగా చేతులకు ఇంకిపోయిన తర్వాత వంట పని చూసుకోవాలి.
శానిటైజర్ ను అతిగా వాడితే చర్మ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని వాడకం తగ్గించాలి. శానిటైజర్లకు కేవలం బ్యాక్టీరియాలను, క్రిములను, వైరస్ లనే అంతం చేస్తుందన్న సంగతిని గమనం లో ఉంచుకోని దీన్ని యూజ్ చేయాలి.
చేతులు జిడ్డుగా అయ్యాయని, మురికి అంటుకుందని శానిటైజర్లను వాడకూడదు. ఆ సమయంలో కూడా శానిటైజర్లను వాడితే ఆ అవశేషాలు అలాగే చేతులకు పేరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు శానిటైజర్ ను దూరంగా ఉంచాలి. ఒకవేళ వాళ్లు కూడా వాడినా చేతి వేళ్లను నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి.
శానిటైజర్లను వాడితే చేతులకు అంటుకున్న క్రిములు చావడం ఎంత నిజమో.. దీనిని వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న మాట కూడా పూర్తిగా నిజమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ శానిటైజర్లు మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాను కొన్ని సార్లు చంపేస్తుందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శానిటైజర్ ను తరచుగా ఉపయోగిస్తే.. శానిటైజర్లకు కూడా చనిపోని బ్యాక్టీరియా తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు .. వీటిని ఎక్కువ వాడితే కొన్ని రోజులకు చర్మం పొడిపారుతుందట. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మళ్లీ మాయిశ్చరైజర్లను వాడాలి. అందుకే ఈ సమస్య రాకుండా ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలంటే శానిటైజర్లకు బదులుగా సబ్బులను వాడటం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.