MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకండి.. లేదంటే?

ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకండి.. లేదంటే?

ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ ను తింటుంటారు. అయితే కొంతమంది వీటిని నానబెట్టి తింటే మరి కొంత మంది మాత్రం అలాగే పచ్చిగానే తినేస్తుంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2022, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉంటాయి. ఇవి మనలో ఎన్నో రకాల పోషకాల లోపాలను పోగొడుతాయి. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని స్నాక్స్ గా తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ ను రోజూ తినడం వల్ల  శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి.  రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది వీటిని నానబెట్టే తింటే.. ఇంకొంత మంది మాత్రం నానబెట్టకుండా పచ్చిగానే అలాగే తింటుంటారు. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
raisins

raisins

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలు ఔషదం కంటే తక్కువేం కాదు. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టి ఉదయమే వీటిని తింటే పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎసిడిటీ సమస్య కూడా తొలగిపోతుంది. 
 

35

ఫిగ్

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఫిగ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ పండు నుంచి పోషకాలను పొందాలంటే మాత్రం వీటిని ఖచ్చితంగా నానబెట్టే తినాలి. నానబెట్టకుండా తింటే ప్రమాదకరం. 
 

45
dates

dates

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అలాగే వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఖర్జూరాలను నానబెట్టే తినాలి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

55

బాదంపప్పులు

బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ , పొటాషియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. అయితే బాదం పప్పులను పచ్చిగానే కాకుండా నానబెట్టి తినడమే మంచిది. అలా తింటేనే వాటిలో  ఉండే పోషాకాలన్నీ అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.  
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Lifestyle: కూల్ వాట‌ర్ తాగితే జ‌లుబు అవుతుందా.? అస‌లు మ్యాట‌రేంటంటే.?
Recommended image2
ఖర్జూరాలు ప్రతిరోజూ తింటే మన శరీరంలో జరిగే మార్పులు ఇవే
Recommended image3
Baking Soda: రాత్రంతా ఫ్రిజ్ లో బేకింగ్ సోడా పెడితే.. జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved