ఈ దీపావళికి అదిరిపోయే రంగోలి డిజైన్లు మీ కోసం..!
Diwali 2023: ఈ ఏడాది దీపావళి పండుగను ఈ నెల 12న జరుపుకోబోతున్నాం. అయితే ఈ రోజు ఇంటిముందు రంగురంగుల ముగ్గులను కూడా వస్తారు. ముద్దొచ్చే ముగ్గులో దీపాలను పెడితే ఇల్లూ వాకిలి ఎంత అందంగా కనిపిస్తాయో కదూ. మరి ఈ దీపావళికి తీరొక్క ముగ్గులు ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పండుగల సమయంలో రంగుల ముగ్గులను వేసే సంప్రదాయం భారతదేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. కానీ పండుగల సమయంలో బిజీగా ఉండటం, సమయం లేకపోవడం వల్ల ఈ రంగుల ముగ్గులను స్కిప్ చేస్తుంటారు. అయితే చాలా తొందరగా, సింపుల్ గా వేసే రంగోలి డిజైన్స్ కూడా ఉన్నాయి. వీటిని తొందరగా వేయొచ్చు. అలాగే ఎంతో అందంగా కూడా కనిపిస్తాయి. మరి ఇల్లు, వాకిలి అందంగా కనిపించడానికి రంగుల ముగ్గులు ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పువ్వులతో..
చాలా మందికి దీపావళి పండుగ నాడు ఇంటిపని, వంటపని, పూజలతో చాలా బిజీగా ఉంటారు. ఒకవేళ మీకు ఇలాగే తక్కువ సమయం ఉంటే పువ్వులతో అందమైన రంగోలీ ముగ్గును వేయండి. అవును బంతిపూలు, గులాబీ రేకులు, చామంతి పువ్వులతో అందంగా ముగ్గును వేయండి. ఇది బలేగా కనిపిస్తుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది.
rangoli
నెమలి రంగోలీ..
దీపావళి రోజున ఈ నెమలి రంగోలిని కూడా మీ ఇంటి గుమ్మం ముందు వేయొచ్చు. దీనిలో ఒక దీపాన్ని పెట్టి అలంకరించొచ్చు. ఈ డిజైన్ పెద్దగా ఉంటుంది. అలాగే అందంగా కూడా ఉంటుంది. రాత్రిపూట దీపాలు వెలిగించి ఈ ముగ్గును అందంగా మెరిసేలా చేయొచ్చు.
దీపాలతో..
దీపావళి రోజున దీపాలతో కూడా రంగోలిని వేయాలనుకుంటే ఈ డిజైన్ మీ ఇంటి అందాన్ని పెంచుతుంది. మీరు దీన్ని మీ వాకిట్లో లేదా ఇంటి ఏ మూలనైనా వేయొచ్చు. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
ముగ్గుతో
పండుగ లేదా ఎలాంటి శుభకార్యమైనా సరే ఇంటి ముందు ముగ్గును ఖచ్చితంగా వేస్తారు. ఈ దీపావళికి అందమైన ముగ్గు వేసి అందులో రంగులు నింపండి. ఇది మీ వాకిలిని, ఇంటిని అందంగా కనిపించేలా చేస్తుంది. రాత్రిసమయంలో ఈ ముగ్గులో దీపాలను కూడా వెలిగించొచ్చు.