బెడ్ షీట్లను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా?
చాలా మంది బెడ్ షీట్లను రెండు మూడు నెలలకోసారి ఉతుకుతుంటారు. కానీ ఇవి మురికిగా మారితే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే బెడ్ షీట్లను ఎన్ని రోజులకోసారి ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గజిబిజీ లైఫ్ లో చాలా మంది హడావుడిగా వచ్చి పడుకోవడమే చేస్తుంటారు. కానీ వాటిని వాష్ చేయాలన్న ఆలోచన కూడా రాదు. చాలా మందికి బెడ్ షీట్లు పడుకునే ముందరే గుర్తొస్తాయి. వీటిని ఉతకాలని కూడా అనిపించదు. కానీ మనం పడుకునే మంచం, ముఖ్యంగా బెడీ షీట్లపై ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే దీనిపై దుమ్ము, ధూళి, మురికి బాగా ఉంటుంది తెలుసా?
వీటిని ఉతకకుండా వాడితే గనుక మనం లేనిపోని అనారోగ్య సమస్యల బారిన ఖచ్చితంగా పడతాం. అందుకే అప్పుడప్పుడు బెడ్ షీట్లను ఉతుక్కోవాలి. అసలు బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బెడ్ షీట్లను ఎన్ని రోజులకోసారి ఉతకాలి?
నిపుణుల ప్రకారం.. ప్రతి ఒక్కరూ బెడ్ షీట్లను ప్రతి ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి ఖచ్చితంగా ఉతకాలి. అయితే ఇది ఎన్నోవిషయాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే?
చెమట: ప్రతిరోజూ వ్యాయామం చేసే వారికి లేదా వేడి వాతావరణంలో ఉండేవారికి చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇలాంటి వారు బెడ్ షీట్లను తరచుగా ఉతుకుతుండాలి.
పెంపుడు జంతువులు: పెంపుడు జంతువులను పెంచుకునేవారు చాలా మందే ఉన్నారు ఈ కాలంలో. అయితే మీకు కూడా పెంపుడు జంతువులు ఉంటే.. అవి పక్కాగా మీ బెడ్ పైకి ఎక్కే అవకాశం ఉంది. దీనివల్ల వాటి జుట్టు, చుండ్రు మీ బెడ్ పై ఖచ్చితంగా పడుతుంది. ఇవి మీ ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి ఇలాంటి వారు కూడా బెడ్ షీట్లను తరచుగా వాష్ చేస్తుండాలి.
అలెర్జీలు: మీకు అలెర్జీ సమస్యలు ఉన్నా కూడా వారం లేదా రెండు వారాలకు ఒకసారి ఖచ్చితంగా ఉతకాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే మీకు దుమ్ముకు లేదా ఇతర అలెర్జీలు ఉంటే గనుక బెడ్ షీట్లను మీకు వీలైనప్పుడల్లా ఉతకాలి.
bedsheet
అనారోగ్యం: అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు కప్పుకున్న బెడ్ షీట్లకు రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు పట్టుకుంటాయి. కాబట్టి మీకు అనారోగ్య తగ్గగానే వాటిని ఖచ్చితంగా ఉతకాలి. అప్పుడే మీకు మళ్లీ అవి అంటుకోకుండా ఉంటాయి. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
బెడ్ షీట్లను క్రమం తప్పకుండా ఎందుకు ఉతకాలంటే?
ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బెడ్ షీట్లను వారం లేదా రెండువారాలకోసారి ఉతకాలంటారు నిపుణులు. ఎందుకంటే మన చర్మం నుంచి చెమట, డెడ్ స్కిన్ సెల్స్, నూనె, ఇతర పదార్థాలు ప్రతిరోజూ రాత్రిపూట బెడ్ షీట్ కు అంటుకుంటాయి. ఇవి రోజు రోజూ పేరుకుపోతాయి. దీనివల్ల బెడ్ షీట్లపై బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ఏర్పడతాయి. వీటివల్ల మనకు చర్మ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
BEDSHEET
శుభ్రపరచడం: బెడ్ షీట్లను క్రమం తప్పకుండా ఉతకడం వల్ల మీ పరుపు శుభ్రంగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. దీనిపై పడుకున్నప్పుడు మీకు బాగా నిద్రపడుతుంది. నిద్రలో ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. ఇది మీకు మంచి రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
వాసన: మీరు గమనించారో లేదో కానీ.. బెడ్ షీట్లను చాలా రోజుల వరకు ఉతకకుండా వదిలేస్తే వాటి నుంచి మురికి, వింత వాసన వస్తుంది. ఈ వాసనకు బ్యాక్టీరియానే కారణం. కాబట్టి తరచుగా బెడ్ షీట్లను ఉతుకుతూ ఉండాలి.
అలెర్జీ కారకాలు: మన కంటికి కనిపించవు కానీ.. మనం కప్పుకునే, పర్చుకునే బెడ్ షీట్లపై దుమ్ము, పురుగులు, పుప్పొడి, ఇతర అలెర్జీ కారకాలు బాగా పేరుకుపోతాయి. ఒకవేళ మీకు గనుక అలెర్జీ ఉంటే వీటి వల్ల ముక్కు కారడం, తుమ్ములు, కళ్లలో చిరాకు వంటి సమస్యలు వస్తాయి.