గుడ్ల గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు..
గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరు. ఇందుకోసం గుడ్లను ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
eggs
గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మనలో ఎన్నో పోషక లోపాలను పోగొడుతాయి. అంతేకాదు ఇవ మనం ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఈ సంగతి పక్కన పెడితే.. గుడ్ల గురించి చాలా మందికి ఎన్నో విషయాలు తెలియవు. మనకు తెలియని గుడ్ల గురించి కొన్ని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సులభంగా తొక్కను తీయొచ్చు
ఉడకబెట్టిన తర్వాత గుడ్డు తొక్కను తీయడానికి చాలా సమయం పడుతుంది. అయితే గుడ్డు తొక్కను సులువుగా వలచాలంటే గుడ్డును ఉడుకబెట్టే ముందు చిన్న పిన్ తో గుడ్డుకు రంధ్రం చేయాలి. దీని వల్ల గుడ్డు ఉడికిన తర్వాత తొక్క సులువుగా వస్తుంది.
గుడ్డు తాజాగా ఉందని ఎలా తెలుసుకోవాలి?
గుడ్డు చెడిపోకుండా, తాజాగా ఉందో? లేదో తెలుసుకోవడానికి ఉప్పు కలిపిన చల్లని నీటిలో వాటిని పెట్టండి. ఒకవేళ ఆ నీటిలో గుడ్డు మునిగిపోతే అది తాజాగా ఉన్నట్టు. ఒకవేళ గుడ్డు నీళ్లపైన తేలితే గుడ్డు చెడిపోయిందని అర్థం.
చల్లటి నీటిలో..
ఉడికించిన గుడ్డు తొక్కను సులువుగా తీయాలంటే ఇవి ఉడికిన తర్వాత చల్లని నీటిలో వేయండి. ఐదు నిమిషాల తర్వాత గుడ్లను తొక్కను వలచండి. సులువుగా తొక్కలు ఊడిపోతాయి.
ఎన్ని రంధ్రాలో
మీకు తెలుసా? ఎగ్ షెల్ లో 17 వేల చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయట. అవును ఈ రంధ్రాలను మనం కళ్లతో చూడలేం.
ఆరోగ్యానికి
గుడ్లలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధులకే కాదు పిల్లలు, యువకులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మొత్తం మీద గుడ్లలను ఇంటిళ్లిపాది తినొచ్చు. ఇవి కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉచుతాయి.
గుండె ఆరోగ్యం
గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆరోగ్యకరమైన కొవ్వులు అంటారు. అయితే ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్త నాళాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసొనను తినొద్దని డాక్టర్లు చెప్తారు. అయితే ఒక గుడ్డు మొత్తం అంటే పచ్చసొనతో పాటుగా తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వారానికి ఆరు గుడ్లు
వారానికి ఆరు గుడ్లను తింటే మీ ఆరోగ్యనికి ఏ ఢోకా లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు మన చేసే మేలు ఎంతో. వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్నమాట.
ఫ్రెష్ గా ఉంచుకోవడం ఎలా?
గుడ్లు చెడిపోకుండా ఫ్రెష్ గా ఉండాలంటే మీరు వీటిని రిఫ్రిజిరేటర్ లో ట్రేలో పెట్టొచ్చు. వీటిని ఇలా పెట్టి గుడ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.
పోషకాల నిధి
గుడ్లలో 11 రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనం తినే ఆహారాలన్నింటిలో కెల్లా గుడ్లలోనే ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.