అనసూయ సెక్స్‌కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది, నిజంగానే అంత అవసరమా? అసలు సైన్స్ ఏమంటోంది
సెక్స్, శృంగారం.. ఇలాంటి పదాలు వినగానే చాలా మంది అదేదో మాట్లాడకూడదని పదంగా భావిస్తుంటారు. నిజానికి సృష్టికార్యమైన సెక్స్ గురించి అంతలా అభద్రతతో ఉండకూడని సైన్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో. అసలు సెక్స్ గురించి నిపుణులు , సైన్స్, పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

మనసులోని మాటను ఎలాంటి ఫిల్టర్ లేకుండా బయటకు చెప్పడంలో ముందు వరుసలో ఉంటుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసినా, ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరిచినా అనసూయ చేసే వ్యాఖ్యలు ఎంతటి సంచనాలకు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.

పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ సెక్స్ అనేది వల్గర్ కాదని తేల్చి చెప్పేసింది. మనిషికి ఆహారం, నిద్ర ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యమన్నట్లు చెప్పుకొచ్చింది. జనం ఎందుకు ఈ విషయం గురించి ఇబ్బందిగా ఫీలవుతారన్న అనసూయ.. అలాగని బహిరంగంగా సెక్స్ చేసుకోవాలని, దాని గురించి బహిరంగంగా మాట్లాడుకోవాలని కాదు.. కాకపోతే అయ్యయ్యో అని తప్పుపట్టాల్సిన పనిలేదు. అది అవసరం. దాని గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు. అది మంచిదే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజంగానే సెక్స్ అంత అవసరమా అన్న ప్రశ్న వస్తోంది. మరి దీని గురించి సైన్స్ నిపుణులు ఏమంటున్నారంటే.
సెక్స్ నిజంగా అంత అవసరమా.?
శృంగారం అనేది కేవలం పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రంగానే చాలా మంది భావిస్తుంటారు. అయితే శృంగారం అనేది శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ఆరోగ్యానికి కీలకమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు. శృంగారం మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు OHSU's Center for Women's Healthలో సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ Nicole Cirino. సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఆయన వివరించారు. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం.
శారీరక ఆరోగ్యం:
శృంగారం చేసే సమయంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రక్తపోటును తగ్గిస్తుందని Nicole Cirinoచెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎంతో తోడ్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా శృంగారం కీలక పాత్ర పాత్ర పోషిస్తుందని వివరించారు..
మానసిక ఆరోగ్యం:
మానసిక ఆరోగ్యానికి కూడా శృంగారం ఉపయోగపడుతుంది. సెక్స్ చేసే సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్ ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడికి శరీరం స్పందించే క్రమంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్టు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జరిపిన పలు పరిశోధనల్లో తేలింది.
బలమైన బంధానికి:
ఆలు, మగల మధ్య బంధం బలోపేతానికి కూడా శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన శృంగార సంబంధం జంటల మధ్య ప్రేమను పెంపొందిస్తుంది. కనీసం వారిని ఒకసారి సెక్స్‌లో పాల్గొన్న జంటలు ఆనందంగా ఉన్నట్లు పైన పేర్కొన్న పరిశోధనల్లో తేలింది.
వ్యాయామంతో సమానమైన లాభాలు:
వ్యాయామం చేస్తే శరీరానికి ఎంత మేలు జరుగుతుందో సెక్స్ చేసినా అలాంటి లాభాలే ఉంటాయని Nicole Cirino చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం శృంగారం సమయంలో నిమిషానికి సుమారు ఆరు కేలరీలు ఖర్చవుతాయని తేలింది.
మెదడు ఆరోగ్యం:
50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగా వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో కూడా శృంగారం ఉపయోగపడుతుందని Nicole Cirino. చెబుతున్నారు. మెదడు పనితీరును శృంగారం ప్రభావితం చేస్తుందని అంటున్నారు. భవిష్యత్తుల్లో అల్జీమర్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
మంచి నిద్ర:
ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే శృంగారంలో పాల్గొన్నప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ మంచి నిద్రకు ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. శృంగార సమయంలో హాయి భావన కలగడానికి కారణమైన ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. మహిళలకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రయోజనం లభిస్తుంది. ఇవన్నీ కంటి నిండా నిద్రకు ఉపయోగపడుతుంది.
మగవారిలో ఈ సమస్యలకు:
మగవారిలో వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలను శృంగారం దూరం చేస్తుంది. శృంగారంలో యాక్టివ్ గా ఉండే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని మేయో క్లినిక్ పరిశోధకులు అంటున్నారు. అదే విధంగా ఎక్కువగా కాలం శృంగారానికి దూరంగా ఉన్న వారిలో అంగ స్థంభన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు.
మహిళల్లో వచ్చే సమస్యలు:
శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే మహిళల్లో పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నెలసరి నిలిచిన మహిళల ప్రైవేట్ పార్ట్ పొడిబారే అవకాశాలు ఉంటాయి. ఇది నొప్పికి దారి తీస్తుందని అంటున్నారు. అయితే రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనే వారిలో ఈ సమస్యలు రావని అంటున్నారు.