డైపర్స్ గురించి ఈ విషయాలు తెలుసుకుంటే.. పేరెంటింగ్ చాలా ఈజీ..
కొత్తగా తల్లిదండ్రులు కాబోతున్న దంపతులు డైపర్స్ గురించిన కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
పేరెంటింగ్.. నేటి కాలపు తల్లిదండ్రులకు కత్తిమీద సాములాంటి వ్యవహారం. ముఖ్యంగా పిల్లలకు ఇప్పుడు డైపర్స్ వాడకం ఎక్కువైపోయింది. అయితే ఇవి ఎలా వేయాలి.. ఎంత సేపు ఉంచాలి. ఎప్పుడు తీసేయాలి. పిల్లలకు సరైన సైజు వేస్తున్నామా.. డైపర్స్ వేయడం కరెక్టేనా? ఇలాంటి అనేక సందేహాలు, గందరగోళం ఉంటుంది.
కొత్తగా తల్లిదండ్రులు కాబోతున్న దంపతులు డైపర్స్ గురించిన కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
యూరిన్, మోషన్ లాంటివి క్లీన్ చేసి కొత్త డైపర్ మార్చడం.. ఆ సమయంలో పిల్లలను హ్యాండిల్ చేయడం కత్తిమీద సాము.
కొన్ని సింపుల్ టెక్నిక్స్ లో దీన్ని ఈజీగా హ్యాండీల్ చేయచ్చు.
డైపర్ వేసేముందు పాపాయికి ఆ ప్లేస్ లో కాస్త పెట్రోలియం జెల్లీని రాయాలి. దీనివల్ల మోషన్, యూరిన్ క్లీన్ చేయడం ఈజీ అవుతుంది.
పాపాయికి సరిపోయే సైజు డైపర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే.. కాళ్లు ఒత్తుకుపోయి పాపాయిని నొప్పి కలగడం.. లేదా పెద్దవైతే లీకేజ్ లు అవుతుంటాయి.
డైపర్స్ లో కూడా అనేక కంపెనీలవి దొరుకుతున్నాయి. సో ఒకే టైప్ డైపర్స్ కు స్టిక్ ఆన్ అవ్వకుండా.. రకరకాల కంపెనీలవి ఎంచుకుంటే వాటిల్లోని తేడాలు తెలుస్తాయి. బేబీకి హాయి ఉంటుంది.
బైటికి వెడుతున్నట్లైతే.. డైపర్స్, వైప్స్, క్లాత్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే బైటికి వెళ్లినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు.
చిన్నపిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. ఇక డైపర్ మార్చేప్పుడు అయితే మరింత కదులుతుంటారు.
అందుకే వారి దృష్టిని డైవర్ట్ చేయాలి. బొమ్మలు ఇవ్వడమో..వారికిష్టమైన వస్తువు చేతిలో పెట్టడం ద్వారా వారి దృష్టి మళ్లిస్తే పని సులభం అవుతుంది.
ఇక పిల్లలు కాలకృత్యాలు అయ్యాక.. సెంటు లేని కాటన్ వైప్స్ తో క్లీన్ చేయాలి. ఆ సమయంలోనే ఏవైనా రాష్ లు వచ్చాయా.. అని గమనించాలి.
డైపర్స్ మార్చే సమయంలో పిల్లలు ఏడవడం, కాళ్లూ, చేతులు తన్నుకోవడం చాలా సాధారణం.. అయితే ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. మీరూ టెన్షన్ పడడం వల్ల ఈ విషయాల్లో మార్పు ఉండదు కాబట్టి.. మీరు ఓపిగ్గా ఉంటే సరిపోతుంది.