MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అందుకే షుగర్ పేషెంట్లు రోజూ ఈ కూరగాయలను తినాలని డాక్టర్లు చెప్తరు..

అందుకే షుగర్ పేషెంట్లు రోజూ ఈ కూరగాయలను తినాలని డాక్టర్లు చెప్తరు..

కొన్ని రకాల కూరగాయలు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. వీటిని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2022, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాంసం కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్లు,  ఖనిజాలు, పొటాషియంతో పాటుగా ఇతర ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్లే మన శరీరానికి బలం వస్తుంది. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. కూరగాయల్లో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చాలా రకాల కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇలాంటి వాటిని మధుమేహులు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు ఎప్పుడూ చెప్తుంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఎలాంటి కూరగాయలు తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
raw papaya

raw papaya

బొప్పాయి

ఆరోగ్యకరమైన కూరగాయలలో బొప్పాయి ఒకటి.  దీనిలో చరాంథిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు దీనిలో పాలీపెప్టైడ్-పి అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు దీన్ని తప్పకుండా తినాలి. 

36

బ్రోకలీ

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఉత్తమ కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. బ్రోకలీలో విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.  దీనిలో విటమిన్ సి తో పాటుగా పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 

46

ముల్లంగి

రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ముల్లంగి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.  దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదింపజేస్తుంది. అవి రక్తప్రవాహంలోకి శోషించుకోబడతాయి. అందుకే ఈ కూర ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. 
 

56

బచ్చలికూర

బచ్చలికూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో  ఫోలేట్, డైటరీ ఫైబర్ , విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ,  విటమిన్ కె  లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. ఇది చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 

66

గ్రీన్ బీన్స్

రెగ్యులర్ గా బీన్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ యే ఉండదు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుందని ఎన్నో అధ్యయనాలు కూడా నిరూపించాయి. 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cost of Living In Goa: బీచ్ లైఫ్ అంటే ఇష్టమా.. మరి గోవాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో తెలుసా?
Recommended image2
South Goa Food: సౌత్ గోవాలో ది బెస్ట్ హోటల్స్ ఇవే.. మార్టిన్స్ కార్నర్ నుంచి జెస్ట్ కేఫ్ వరకు టాప్ 9 ప్లేసెస్!
Recommended image3
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved