Diabetes: మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరకూడదంటే.. ఈ ఐదు పండ్లను ఖచ్చితంగా తినాల్సిందే..
Diabetes: డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడం సవాలుతో కూడుకున్న పనే. అయితే కొన్ని రకాల పండ్లు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అవేంటంటే..

ప్రస్తుత కాలంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ఈ రోగులకు వారి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవడం సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు షుగర్ లెవెల్స్ ను పెంచే ఆహారాలను అస్సలు తీసుకకోకూడదు. అయితే డయాబెటీస్ పేషెంట్లకు కొన్ని రకాల పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లలలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి కూడా కృత్రిమ చక్కెర వలె షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కానీ ఒక తేడా ఉంది. ఏంటంటే పండ్లలో ఉండే చక్కెర కంటెంట్ అంత హానీ కాదు. అయినప్పటికీ వీటిని కూడా లిమిట్ లోనే తినాలని నిపుణులు చెబుతున్నారు.
పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తప్పకతినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే డయాబెటీస్ పేషెంట్లకు మంచి చేసే పండ్లు ఏంటంటే..
అత్తిపండు.. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం రక్తంలోని చక్కెరను ఒకేసారి పెంచే అవకాశం ఉంది. అయితే దీని పీచెస్ లో బయోయాక్టిక్ కాంపౌండ్ ఊబకాయం, మధుమేహం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో పోరాడగలదు. పీచెస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుంది.
జామూన్ లేదా బ్లాక్ ప్లమ్.. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి జామూన్ లేదా ఇండియన్ బ్లాక్ ప్లమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని డయాబెటీస్ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పిండి పదార్థాలను శక్తిగా మార్చడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది.
ఆపిల్ పండు.. ఈ పండులో ఫైబర్ కంటెంట్, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉటాయి. ఫ్రక్టోజ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ పండు మలబద్దకాన్ని నివారించడానికి, కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణకక్రియ ప్రక్రియను, చక్కెరన శోషణను కూడా నెమ్మదిస్తుంది. అంటే షుగర్ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా వెలుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచదు.
బొప్పాయి.. డయాబెటీస్ పేషెంట్లు తరచుగా బొప్పాయి పండును తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. పలు నివేదికల ప్రకారం.. బొప్పాయి శరీరంపై హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉటుంది. ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఆలాగే బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో తక్కువ కేలరీలు, విటమిన్ బి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
జామకాయ.. జామకాయలో కేలరీలు తక్కువగా ఉండి పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమై కణాల ద్వారా నెమ్మదిగా శోషించబడుతుంది. ఈ పండు ఇతర పండ్లలాగ రక్తంలోని షుగర్ లెవెల్స్ నుు పెంచదు. ఈ పండులో నారింజ పండు కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.