Diabetes Care Tips: డయాబెటిస్ పేషెంట్లకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే వీటిని తినాలి..
Diabetes Care Tips: డయాబెటిస్ పేషెంట్లు వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తింటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదముంది.

Diabetes Care Tips: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఒత్తిడితో కూడుకున్న లైఫ్, మారుతున్న జీవన శైలి, కల్తీ ఫుడ్ వంటి రకరకాల కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందులోనూ చిన్నవయసు వారు కూడా ఈ కారణాల చేత డయాబెటిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం బారిన పడిన వాళ్లు వారు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. వీటి ద్వారా మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏయే సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క ఆహారానికి రుచిని తేవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందులోనూ ఈ దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, Antiviral, Antifungal గుణాలుంటాయి. టైప్ 2 మధుమేహ ప్రమాదన్ని తగ్గించడంలో ఈ దాల్చిన చెక్క ఎంతో సహాయపడతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు ఎటువంటి అనుమానం లేకుండా తమ రోజు వారి ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పసుపు: మెరుగైన ఆరోగ్యానికి పసుపు ఎంతో అవసరం. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే కదా.. ప్రతి వంటలో పసుపును వేస్తుంటారు. అంతేకాదు ఆరోగ్యకరమైన మాసాలా దినుసుల్లో పసుపు ఒకటిగా ఉంది. అందులోనూ ఇది Antibiotic గా పనిచేస్తుంది. దీంతో ఇన్నో వ్యాధులు సోకకుండా చేయవచ్చు. కాబట్టి ఈ పసుపును డయాబెటీస్ పేషెంట్లు కూడా అనుమానం లేకుండా తీసుకోవచ్చు.
మెంతులు: చర్మ నిగారింపుకు , కేశాల సంరక్షణలో మెంతులు దివ్య ఔషదంలా ఉపయోగాపడతాయని మనకు తెలిసిందే. ఈ మెంతులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందులోనూ ఇవి డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు టైప్ 2 మధుమేహులకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయట. ఇందుకోసం.. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ మెంతులను వెయ్యాలి. వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే ఎంతో మంచిది.
cumin
జీలకర్ర: జీలకర్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులోనూ వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మన శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ జీలకర్ర కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది.