MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నోటి దుర్వాసనకు పోషకాల లోపం కూడా ఒక కారణమేనా..?

నోటి దుర్వాసనకు పోషకాల లోపం కూడా ఒక కారణమేనా..?

నోటి దుర్వాసన ఎన్నో అనారోగ్య సమస్యలకు సంకేతం కూడా. అయితే మన శరీరంలో కొన్ని పోషకాల లోపం ఏర్పడితే కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 12 2022, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నోటిలో దుర్వాసన చాలా ఇబ్బందికరమైంది. దీనివల్ల ఒక వ్యక్తికి దగ్గరగా వెళ్లలేని పరిస్థితి వస్తుంది. అయితే నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలున్నాయి. నోటి సమస్యలు, శారీరక సమస్యలు, కొన్ని రకాల జబ్బులకు కూడా ఇది సంకేతం. శరీరానికి సరిపడా నీళ్లను తాగపోతే కూడా బ్రష్ చేసుకున్నా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోతే కూడా నోటి నుంచి చెడు వాసన గుప్పున వస్తుంది. ఇవే కాకుండా శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపిస్తే కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

విటమిన్ డి

విటమిన్ డి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది లోపిస్తే ఎముకలు, దంతాలు బలహీనంగా మారుతాయి. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఎముకల పగుళ్లు, దంతాలు వదులుగా తయారవుతాయి. అంతేకాదు ఈ విటమిన్ లోపం నోటి నుంచి చెడు శ్వాసకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి వయసుకు తగ్గట్టు విటమిన్ డి తీసుకోకుంటే.. రుచి, వాసనను గుర్తించలేరు. అందుకే ఈ విటమిన్ లోపించకుండా ఉండాలి. 
 

37

విటమిన్ డి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే మాకేరెల్, ట్యూనా, పలాసా చేపల, సాల్మన్ చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, పాల, పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, గోధుమలు, ఓట్స్, రాగి, బాదం పాలు, సోయా పాలు, టోఫు,, సోయా పెరుగు, ఆరెంజ్ జ్యూస్ లల్లో ఎక్కువగా ఉంటుంది. 

47

విటమిన్ సి లోపం

విటమిన్ సి లోపిస్తే కూడా మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. శరీరంలో విటమిన్ సి లోపిస్తే చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అలాగే చెడు శ్వాస కూడా వస్తుంది. ఇవి విటమిన్ సి లోపం ప్రధాన లక్షణాల్లో ఒకటి. నిజానికి విటమిన్ సి నోటి కణజాలాలను పునరుద్ధరిస్తుంది. అందుకే శరీరంలో విటమిన్ సి లోపించకుండా జాగ్రత్త పడాలి. 
 

57

ఈ విటమిన్ సి  జామకాయ, పసుపు రంగు క్యాప్సికమ్, కొత్తిమీర, ఎరుపు రంగు క్యాప్సికమ్, కివి, బ్రోకలీ, లిచీ, బొప్పాయి, నిమ్మకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీలు, పైనాపిల్, కాలీఫ్లవర్, ఉసిరి, మామిడి పండ్లు, టమాటాల్లో ఎక్కువగా ఉంటుంది. 
 

67

ఐరన్ లోపం

నోటి దుర్వాసనకు శరీరంలో ఐరన్ లోపించడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల నాలుక ఉబ్బడంతో పాటుగా నోట్లో పుండ్లు కూడా ఏర్పడతాయి. ఆ తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇది చెడు శ్వాసకు దారి తీసే సాధారణ కారణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. 
 

77

ఐరన్ కంటెంట్ పచ్చని కూరగాయలు, ఆలుగడ్డలు, పుట్టగొడుగులు, ఆలివ్స్, మల్బరీ పండ్లు, డ్రై ఫ్రూట్స్, జీడి పప్పు, పిస్తా, ద్రాక్ష, చికెన్ లివర్, బీఫ్, టర్కీ కోడి, సార్ డైన్ చేపలు, కోడి గుడ్లు, గుల్ల చేపలు, చిక్కుడు, బీన్స్, ఓట్స్, క్వినోవా, బాదం పప్పులు, టోఫు, డార్క్ చాక్లెట్లలో ఎక్కువగా ఉంటుంది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Recommended image2
Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image3
Gut Health: పేగుల ఆరోగ్యం కోసం ఈ 7 పండ్లు తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved