Beauty Tips: జుట్టు ఊడిపోకుండా ఉండాలా.. అయితే ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే?
Beauty Tips: అసలే నేటి రోజుల్లో ఉన్న కాలుష్యానికి నెత్తి మీద జుట్టు ఉండటం లేదు అలాంటిది మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల కూడా జుట్టు ఊడిపోవడం మొదలైతే అసలు భరించలేము అందుకే ఈ అలవాట్లు ఉంటే వెంటనే వాటికి చెక్ పెట్టండి.

నేటి కాలుష్య ప్రపంచంలో జుట్టు రాలిపోవడం లేదా పెరగకపోవడం అనేది యువతకి పెద్ద సమస్యగా మారిపోయింది. దానికి కారణం బాహ్య ప్రపంచానికి సంబంధించిన కారణాలు కొన్ని అయితే, మనం చేజేతులా చేస్తున్న తప్పులు కొన్ని.
అవేంటో చూద్దాం. తలకి స్నానం చేసిన వెంటనే జుట్టు తడి ఆరకుండా పడుకుంటున్నారా.. అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. తడితలతో పడుకుంటే జుత్తికి డ్యామేజీ జరిగి ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.
అలాగే తల స్నానం చేసేటప్పుడు వేడి నీరు తలకి పోసుకోకండి. అలా చేయటం వలన జుట్టు డ్రైగా మారి చిట్లిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా రాలిపోవడం ప్రారంభిస్తుంది. తల స్నానం చేసిన వెంటనే తడితలని దువ్వెనతో దువ్వుతున్నట్లయితే మీ జుట్టుకి మీరు హాని చేస్తున్నట్లే.
తడితల ని దువ్వటం వలన వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే హెయిర్ డ్రై హెయిర్ స్టైల్ లాంటి వస్తువులని తరచుగా వాడకండి. ఆ నిమిషానికి హెయిర్ ఎఫెక్టివ్ గా కనిపించినా ఆ ఎలక్ట్రిక్ పరికరాల వల్ల జుట్టు కి చాలా డేమేజి జరుగుతుంది.
అలాగే జుత్తికే రంగు వేయాలనుకుంటే సహజ రంగుని ఉపయోగించండి హానికరమైన పదార్థాలు లేని రంగులు వాడండి. మీరు వాడే ఉత్పత్తులలో పారబిన్ ఈ డి టి ఏ సల్ఫేట్ రిసర్సినోల్ మినరల్ ఆయిల్ సోడియం క్లోరైడ్ సోడియం పర్బోరేట్ సింథటిక్ సువాసనలు లేకుండా చూసుకోండి.
అలాగే షాంపూ చేసుకునేటప్పుడు ఎక్కువ మెరుగు వస్తే తల శుభ్రంగా క్లీన్ అయింది అనుకుంటారు. చాలామంది కానీ ఆ నూరుకు సల్ఫేట్ వల్ల వస్తుంది ఇది జుట్టుకి చాలా హానికరం సల్ఫేట్ లేని షాంపుని వాడితే చాలా మంచిది దీనివల్ల జుట్టు విరిగిపోదు.