MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cranberry : ఈ పండు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాదు.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది..

Cranberry : ఈ పండు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాదు.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది..

Cranberry : పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో  క్రాన్ బెర్రీలను తరచుగా తినడం వల్ల ఒంట్లో చెడు కొవ్వు కరగడమే కాదు మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2022, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..  క్రాన్ బెర్రీస్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి (Memory) మెరుగుపడటమే కాదు.. చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) కూడా తగ్గుతుందని కనుగొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

50 నుంచి 80 ఏళ్ల మధ్యనున్న వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారికి రోజుకు ఒక కప్పు క్రాన్ బెర్రీస్ (Cranberry)ను ఇచ్చారు. డిమెన్షియా (Dementia) వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నివారణపై ఈ పరిశోధనలు ప్రభావం చూపుతాయని మేము ఆశిస్తున్నాము..."  అని డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులలో ఒకరైన డేవిడ్ వోసర్ మాట్లాడుతూ..

39

చిత్తవైకల్యం (Dementia) 2050 నాటికి సుమారు 152 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని ఆయన భావిస్తున్నారు. దీనికి చికిత్స లేదు. అందుకే వ్యాధి బారిన పడకుండా, బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం, జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ డేవిడ్ చెప్పారు.

49

కొన్ని అధ్యయనాల ప్రకారం.. బెర్రీలకు ఎరుపు మరియు నీలం రంగును ఇచ్చే ఆంథోసైనిన్స్ (Anthocyanins) ,  ప్రో ఆంతోసైనిడిన్లు (Proanthocyanidins) అధికంగా ఉండే ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని కనుగొన్నారు.

59

క్రాన్ బెర్రీస్ లో ఎన్నో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ ,శోథ నిరోధక  (Anti-inflammatory) లక్షణాలను కలిగి ఉంటాయి. 12 వారాల పాటు క్రాన్ బెర్రీలను తిన్న వారి మెదడు పనితీరు, కొలెస్ట్రాల్ పై ఏ విధమైన ప్రభావం పడిందనే దానిపై ఈ  పరిశోధన చేశారు. 

69
cranberry

cranberry

క్రాన్ బెర్రీలు మన మెదడు ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపాయని నిపుణులు కనుగొన్నారు. క్రాన్ బెర్రీలను తీసుకోవడం వల్ల నాడి (Nervous) పనితీరు, మెదడుకు రక్త సరఫరా (Brain perfusion), జ్ఞాపక శక్తి వంటి వాటిపై మంచి ఫలితాలొచ్చాయి. క్రాన్ బెర్రీలు వీటి పనితీరును మెరుగుపరిచాయిని నిపుణులు చెబుతున్నారు. 

79

క్రాన్ బెర్రీలను తినేవారికి ఆక్సిజన్, గ్లూకోజ్ వంటి ముఖ్యమైన పోషకాలు మెదడులోని కీలక భాగాలకు చేరి రక్తప్రసరణను మెరుగుపరిచడంతో..  మెమోరి పని తీరు మెరుగుపడిందని అధ్యయనం వెల్లడిస్తోంది. 

89

క్రాన్ బెర్రీల్లో ఉండే పోషకాలు.. 100 గ్రాముల క్రాన్ బెర్రీ పండ్లలో 46 గ్రాముల కేలరీలు, 3.6 గ్రాముల ఫైబర్, 4.3 గ్రాముల చక్కెర, 11 మి.గ్రా భాస్వరం, 91 మైక్రోగ్రాముల లుటిన్ ఉంటాయి. ఈ పండులో తక్కువ కేలరీలు, అధిక పోషకాలుంటాయి. ఈ పండులో.. వృద్ధాప్యం కారణంగా వచ్చే దృష్టి నష్టాన్ని (Vision loss) ను నివారించడంలో సహాయపడే పదార్థాలు కూడా ఉన్నాయి.

99
cranberry

cranberry

100 గ్రాముల స్వచ్ఛమైన క్రాన్ బెర్రీ రసంలో 12 గ్రాముల చక్కెర, 13 మి.గ్రా భాస్వరం, 77 మి.గ్రా పొటాషియం, 9.3 మి.గ్రా విటమిన్ సి మరియు 5.1 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉన్నాయి. ఎండిన పండ్లు అధిక కేలరీల విలువను కలిగి ఉంటాయి. ఇందులో ఫైటోకెమికల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Belly Fat: పొట్ట కొవ్వు కరిగిపోవాలంటే ప్రతిరోజూ ఈ టీ తాగితే చాలు.. త్వరగా స్లిమ్‌ అవుతారు
Recommended image2
Cotton Suits:సమ్మర్ కి కంఫర్ట్ ఇచ్చే ట్రెండీ కాటన్ డ్రెస్సులు
Recommended image3
Two Headed Snakes : నిజంగానే రెండుతలల పాములు ఉంటాయా..? ఇవి కోట్లు విలువ చేస్తాయా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved