MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • ఈ మొక్క విత్తనాలను తప్పక తినండి.. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. మధుమేహం కూడా కంట్రోల్ లో ఉంటుంది..

ఈ మొక్క విత్తనాలను తప్పక తినండి.. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. మధుమేహం కూడా కంట్రోల్ లో ఉంటుంది..

ఈ విత్తనాల్లో యాంటీ  ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక టీస్పూన్ ఈ గింజలను తింటే మధుమేహం నుంచి  కొలెస్ట్రాల్ వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 08 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
cholesterol

cholesterol

నేడు ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. కానీ కొలెస్ట్రాల్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు తీపి పదార్థాలను, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. వీళ్లు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అప్పుడే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే కొత్తిమీర గింజలు అంటే ధనియాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ గింజలను ప్రతికూరలో ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. వీటిని పొడి చేసి కూరల్లో వేస్తే కూరలు టేస్టీగా అవుతాయి. కానీ ఈ గింజల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ధనియాల్లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒక టీస్పూన్ ధనియాలను తీసుకుని మూడు నుంచి నాలుగు నిమిషాలు నీళ్లలో మరగబెట్టి దానిని వడకట్టి తాగితే.. ఎంతటి కొలెస్ట్రాల్ అయినా ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

35

కొత్తిమీర  గింజల ఇతర ప్రయోజనాలు

ధనియాలు పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ గింజలు మలబద్దకం, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ధనియాల్లో ఉండే పీచుపదార్థం, యాంటీ  ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజలు ఆహారాన్ని సులువుగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. 
 

45

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి

కొత్తిమీర గింజలతో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సులువుగా కరిగించుకోవచ్చు. అంతేకాదు ఇవి మధుమేహులకు కూడా ప్రయోజకరంగా ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్లు, యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 

55

జుట్టు, చర్మ సమస్యలు

ధనియాలు చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి. హెయిర్ ఫాల్, చుండ్రు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గాలంటే ధనియాలను తప్పక తినండి. ధనియాల్లో విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ సి, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Washing Machine Hacks: వాషింగ్ మెషీన్ లో ఇవి వేస్తే బట్టలు ముడతలే పడవు
Recommended image2
Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్
Recommended image3
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved