షుగర్ నియంత్రణలో ఉండాలంటే ..!
మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటం ఎంతో ముఖ్యం. ఇందుకోసం కొన్నిచిట్కాలను ఫాలో అవుతూ ఉండాలి.. అవేంటంటే..

ప్రస్తుత కాలంలో షుగర్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. వీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ప్రవర్తించిన వారి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దాంతో వీరు మరిన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే వీరు షుగర్ ను నియంత్రణనలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకోసం ఈ క్రింది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి.
వాకింగ్: షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. మీరు ఖచ్చితంగా చేయాల్సిన వ్యాయాల్లో చాలా ముఖ్యమైనది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ వాకింగ్ చేసేట్టు సమయాన్నికేటాయించుకోవాలి.
యోగా: నిత్యం యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు జరుగుతాయి. యోగాతో ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చే అవకాశమే ఉండదు.
yoga
యోగాతో మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే నరాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఒత్తిడికి గురైన డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి వారు నిత్యం యోగాను చేయాలి.
స్విమ్మింగ్: స్విమ్మింగ్ తో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా.. తరచుగా ఈత కొడితే ఒంట్లో ఉన్న కొవ్వు నిల్వలు కరగడం మొదలవుతాయి. అలాగే స్విమ్మింగ్ తో ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈత కూడా వ్యాయామం లాంటిదే.
డ్యాన్స్: డ్యాన్స్ చేయడమంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. డ్యాన్స్ లో బాడీ రిలాక్స్ కావడమే కాదు ఒత్తిడి కూడా పోతుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
సైకిల్ తొక్కడం: సైకిల్ తొక్కడానికి వయసు ఎప్పుడూ అడ్డం కాదు. అన్ని వయసుల వారు బేషుగ్గా సైకిల్ ను తొక్కొచ్చు. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కేలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చైపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.