dogs: కుక్కల పెంపకంలో చాలామంది చేసే పొరపాట్లు ఇవే.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?
dogs: కుక్కలు పెంచడం చాలా మందికి అలవాటు. అయితే యజమానులు తెలియకుండా చేసే తప్పుల వల్ల అవి శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటాయి. దీంతో యజమానులను అనేక విధంగా ఇబ్బందులు పెడతాయి. కుక్కల పెంపకంలో చేయకూడని కొన్ని తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలకూ ఎమోషన్స్ ఉంటాయి
జంతువులను పెంచుతూ, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ చాలామంది ఆనందం పొందుతారు. అయితే సరైన సంరక్షణ, ప్రేమ అందించకపోతే వాటి ప్రవర్తనలో తేడా వస్తుంది. అలాంటప్పుడే యజమానులను సైతం కరుస్తాయి. ముఖ్యంగా కుక్కలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి చిన్న పిల్లలతో సమానం. వాటికి బాధ, అసూయ, కోపం, సంతోషం లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోకుండా ఎప్పుడూ వాటిపై కోప్పడుతూ, డిమాండ్ చేస్తూ పెంచితే కొన్నాళ్లకు అవి సహనాన్ని కోల్పోతాయి. కుక్కలను పెంచడంలో చేయకూడదని తప్పలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి
కుక్కలకు సరైన శిక్షణ ఇవ్వకపోతే అవి భయపడి అందరినీ కరుస్తాయి. సాధారణంగా కుక్కలు పెంచుకోవాలనుకొనే వారు చిన్న పిల్లలను తెచ్చుకొని పెంచుకోవడం మంచిది. వాటికి గుర్తుపట్టే శక్తి వచ్చే సరికి యజమాని ప్రేమ చూపించడం ద్వారా అవి చాలా విశ్వాసం చూపిస్తాయి.
ఒకవేళ పెద్ద కుక్కలను తెచ్చుకున్నప్పుడు వాటికి మంచి ఫుడ్, నచ్చినది పెట్టడం ద్వారా మచ్చిక చేసుకోవచ్చు. తర్వాత శిక్షణ ఇస్తే ఈజీగా నేర్చుకుంటాయి.
ఊరు వెళ్తే ఇంటిని ఎలా జాగ్రత్తగా కాపాలా కాయాలో శిక్షణ ఇవ్వాలి.
భావోద్వేగాలు అర్థం చేసుకోవాలి
కుక్కలు కూడా భావోద్వేగాలకు లోనవుతాయి. వాటిని నచ్చిన ఫుడ్ పెడితే ఆనందం వ్యక్తం చేస్తాయి. నచ్చని పని చేస్తే కోపం కూడా చూపిస్తాయి. వాటిని అర్థం చేసుకొని రిప్లై ఇవ్వకపోతే బాధపడతాయి. అలాంటి సమయంలో వాటికి నచ్చజెప్పే విధంగా ప్రవర్తించాలి. అవి అర్థం చేసుకొని మీరు చెప్పినట్టు వింటాయి.
మీ పని ఒత్తిడిలో వాటిని పట్టించుకోకుండా ఉండొద్దు
సాధారణంగా అందరూ చేసే తప్పేంటంటే.. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంటి పనుల్లో పడిపోయి కుక్కలకు కేవలం ఫుడ్ పెట్టి వదిలేస్తారు. అవి అరుస్తుంటే వాటిపై కోప్పడటం, కొట్టడం లాంటివి చేస్తారు. వాటి అవసరాన్ని అర్థం చేసుకొని వాటితో కాస్త సమయం గడపకపోతే అవి చాలా డల్ అయిపోతాయి. ఇలాంటి సమయంలోనే ఒక్కోసారి యజమానులపై కూడా దాడి చేస్తాయి.
ప్రతి రోజు కాస్త సమయంలో వాటితో గడపాలి. దగ్గరకు తీసుకొని నిమరడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, వాటితో ఆడటం లాంటివి చేయాలి. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అవి తినే వరకు దగ్గరుంటే అవి చాలా ఆనందపడతాయట.
అప్పుడప్పుడూ వేరే ఊరు తీసుకెళ్లాలి
కుక్కలను పెంచే వారు సాధారణంగా వాకింక్ తోడుగా వాటిని తీసుకెళ్తుంటారు. ఇది వాటికి చాలా సంతోషాన్నిస్తుంది. అయితే వేరే ఊర్లు వెళ్లే వారు అప్పుడప్పుడూ వాటిని కూడా తీసుకెళ్లడం మంచిది. దీని వల్ల అవి యజమానులపై అమితమైన విశ్వాసాన్ని, ప్రేమను పెంచుకుంటాయి.
యజమానులు ఇంట్లో లేని సమయంలో ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాలా కాస్తాయి. యజమాని కుటుంబానికి అన్ని విధాలుగా సాయంగా ఉంటాయి.
కుక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించాలి
కుక్కలు ఏ భావోద్వేగాన్నయినా అరిచే చెప్తాయి. వాటి అరుపును బట్టి అవి ఏం కావాలంటున్నాయో అర్థం చేసుకోవాలి. అవి తమ అనారోగ్యాన్ని కూడా అరిచే చెబుతాయి. తిండి మానేయడం, డల్ గా పడుకోవడం ఇలాంటివి చేస్తే ముందే గుర్తించి వైద్యం చేయించడం మంచిది.
వాటికి సోకిన రోగాన్ని వెంటనే గుర్తించకపోతే అవి కుటుంబసభ్యులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్లు కుక్కల వల్ల త్వరగా రోగాల బారిన పడతారు.