Recipes: చెట్టినాడు స్టైల్ లో పెప్పర్ ప్రాన్స్ ఫ్రై.. అదిరిపోయే టేస్ట్ తో మన ఇంట్లోనే ట్రై చేద్దాం!
Recipes: ఇప్పుడు పిల్లలు ఏది చేసి పెడితే అది తినే రకం కాదు. రోజుకో రకం రుచి కావాలంటూ పేచీలు పెడతారు. అలాంటి పిల్లల కోసం ఈ స్పెషల్ చెట్టినాడు స్టైల్ పెప్పర్ ప్రాన్స్ ఫ్రై చేద్దాం.
ఇప్పుడు పిల్లలు ఏది కావాలంటే అది చేసి పెట్టాలి. లేదంటే తినటం మానేస్తున్నారు. సెలవులు వస్తే వాళ్ళ కోరికలకి మరిన్ని రెక్కలు వస్తాయి. అలాంటి గడుగ్గాయి పిల్లల కోసం ఈ చెట్టినాడు ప్రాన్స్ పెప్పర్ ఫ్రై చేసి పెట్టండి. దెబ్బకి ఫ్లాట్ అయిపోతారు. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం.
రొయ్యలు 1/2 కేజీ, ఉప్పు రుచికి సరిపడా, పసుపు ఒక టేబుల్ స్పూన్, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, సోపు ఒక టేబుల్ స్పూన్, ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ వేయించడానికి సరిపడా నూనె.
గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, అలాగే కాసింత కరివేపాకు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలను బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. నీరు పూర్తిగా దిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోండి.
ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర కలిపి పొడిచేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండలిలో కొంచెం నూనె వేసి తాలింపు దినుసులతో తాలింపు వేయండి. తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించండి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. ఇప్పుడు కారం,జీలకర్ర పొడి,గరం మసాలా కొద్దిగా పసుపు వేసి కలపండి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసి పావు కప్పు నీళ్లు పోసి ఉడికించండి.
ఇది జ్యూసీగా కాకుండా పొడిపొడిగా ఉండేలాగా చూసుకోండి.ముక్క బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత తీసి మరో గిన్నెలో సర్వ్ చేసుకోండి. ఇంకేముంది రుచికరమైన చెట్టినాడు స్టైల్ పెప్పర్ ప్రాన్స్ ఫ్రై రెడీ.