Recipes: చట్నీ ఏం చేయాలో అర్థం కానప్పుడు.. ఘుమఘుమలాడే చెట్టినాడ్ఇడ్లిపొడి చేసి చూడండి!
Recipes: ఒక్కొక్కసారి చెట్నీ చేయడం వీలుపడదు, అలాంటప్పుడు వెంటనే ఈ చెట్టినాడ్ఇ డ్లిపొడి ఇంట్లో ఉంటే ఇడ్లికే కాకుండా అన్ని రకాల టిఫిన్స్ కి కూడా చాలా బాగుంటుంది అందుకే ఈ పొడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడ్ ఇడ్లీ పొడి కేవలం టిఫిన్స్ లోకి కాకుండా చాలా ఐటమ్స్ కి సైడ్ డిష్ గా ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు 1/2 కప్పు,
శనగపప్పు అర కప్పు, కందిపప్పు అర కప్పు, ఎర్ర మిర్చి 15, అల్లం నూనె రెండు టీ స్పూన్లు, ఇంగువ ఒక టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు అరకప్పు, ఇంగువ ఒక టీ స్పూన్,రాళ్ల ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
ముందుగా పాన్ వేడి చేసి అందులో ఎండుమిరపకాయలు వేసి మీడియం మంట మీద ఐదు నిమిషాలు వేయించండి, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి తర్వాత ఉప్పు మరియు ఇంగువ జోడించండి రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
తర్వాత పాన్ లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ జోడించి కరివేపాకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి తరువాత పాన్ లో హాఫ్ టీ స్పూన్ నూనె వేసి ముందు మినపప్పుని..
గోధుమ రంగులో వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలిన పప్పులు కూడా అలాగే వేయించి పక్క పెట్టుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్నంతా బ్లండర్ లో వేసి బరకగా పొడిగా చేసుకోండి.
మెత్తగా కావాలి అంటే జల్లెడ పట్టుకోండి లేదంటే బరకగానే బాగుంటుంది. వేడివేడి ఇడ్లీలోకి నెయ్యి కాంబినేషన్తో ఈ చెట్టినాడు ఇడ్లీ పొడి కలుపుకొని తింటుంటే స్వర్గానికి కాస్త దూరంలో ఉంటాం అంతే.