MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chanakya Niti: తెలివైనవారు ఈ 5 విషయాలు ఎవరితోనూ పంచుకోరు..!

Chanakya Niti: తెలివైనవారు ఈ 5 విషయాలు ఎవరితోనూ పంచుకోరు..!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. అలా పంచుకోవడం వల్ల.. లాభం లేకపోగా మరీ ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 05 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాణక్య నీతి..
Image Credit : AI Image

చాణక్య నీతి..

ఈ రోజుల్లో సోషల్ మీడియా తెచ్చిన ట్రెండ్ వల్ల ప్రతి ఒక్కరూ తమ మనసులోని ప్రతీ ఆలోచనను, వ్యక్తిగత విషయాలను పబ్లిక్ గా షేర్ చేసుకుంటున్నారు. కానీ, మనం ఎంత ఎక్కువగా విషయాలను బయటపెడుతుంటే, ఇతరులు మనల్ని అంత సులభంగా తమ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. నిజమైన తెలివైన వారు.. తమ జీవితంలోని కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోరు అని చాణక్యుడు చెప్పాడు. మరి, ఏ విషయాలను పంచుకోకూడదో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.మీ బలహీనతలు..
Image Credit : Instagram

1.మీ బలహీనతలు..

మీ మనసును బాధిస్తున్న బాధను, దుఃఖాన్ని లేదా మీ బలహీనతలను ఎప్పుడూ నలుగురి ముందు బహిరంగంగా చూపించకండి. ఇతరులు మీ ముందర సానుభూతి చూపినట్లు నటించినా, మీ వెనుక మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. మీ మానసిక బలహీనతలు ఏమిటో శత్రువులకు తెలిస్తే, వారు మీ బలమే మీపైకి ప్రయోగించి సులభంగా మిమ్మల్ని నియంత్రిస్తారు. కాబట్టి మీ బలహీనతలను మీలోనే దాచుకోవడం ఉత్తమం.

2. కుటుంబ కలహాలు.. 

ఇంటి గుట్టు రోడ్డున పెట్టకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మీ ఇంట్లో జరిగే తగాదాలు లేదా అభిప్రాయ భేదాలను మూడవ వ్యక్తులతో పంచుకోవడం వల్ల మీ కుటుంబ గౌరవానికి తీవ్ర భంగం కలుగుతుంది. మీ కుటుంబ సమస్యలను తీర్చడానికి బయటి వాళ్ళు ఎవరూ నిజమైన శ్రేయోభిలాసులుగా ముందుకు రారు. బదులుగా, ఆ విషయాలను వారు తమ స్వార్థం కోసం, గాసిప్స్ కోసం ఉపయోగించుకునే ప్రమాదం ఉంది.

33
3. జరిగిన అవమానాలు..
Image Credit : Asianet News

3. జరిగిన అవమానాలు..

ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు లేదా అందరిలో అవమానించినప్పుడు, ఆ బాధను వెంటనే పట్టుకుని అందరికీ చెప్పుకోవడానికి పరుగెత్తుతుంటాం. కానీ చాణక్యుని ప్రకారం ఇది చాలా తప్పు. మీ అవమానాన్ని ఇతరులతో పంచుకుంటే, వారు మీ పట్ల గౌరవం కోల్పోవడమే కాకుండా, మీ వీక్‌నెస్‌గా భావించి మరింత చిన్నచూపు చూస్తారు. సమాజంలో మీ హుందాతనం తగ్గిపోతుంది.

4. మీ ప్రణాళికలు.. 

మీరు భవిష్యత్తులో సాధించాలనుకునే లక్ష్యాలు లేదా ప్రాజెక్ట్‌ల గురించి ముందుగానే ఊరూవాడా డప్పు కొట్టకండి. ఒక వివేకవంతుడు తన ఆలోచనను రహస్యంగా ఉంచి, అది పూర్తయిన తర్వాతే లోకానికి తెలియజేస్తాడు. ఏ పని జరగకముందే దానిని బహిరంగపరిస్తే, మీ పోటీదారులు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.

5. ఆర్థిక నష్టాలు, డబ్బు సమస్యలు

డబ్బు విషయాలను ఎప్పుడూ పబ్లిక్ చేయకూడదు. మీ ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కరితో పంచుకోవడం వల్ల ఎవరూ మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. బదులుగా, సమాజం మిమ్మల్ని చిన్నచూపు చూస్తుంది, మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంది. ఇది మీ వ్యాపార భాగస్వాముల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, రుణదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి మీ ఆర్థిక విషయాలు అత్యంత నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Beetroot:బీట్రూట్ రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా
Recommended image2
Cow Ghee Vs Buffalo Ghee: ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండింటి లో ఏది మంచిది?
Recommended image3
Gongura Chicken Recipe: ఆంధ్రా స్టైల్లో గొంగూర చికెన్.. లొట్టలేసుకుంటూ తినేస్తారంతే!
Related Stories
Recommended image1
Ghee Temple: నీటితో కాదు.. 40వేల కేజీల నెయ్యితో నిర్మించిన టెంపుల్... ఎండకు నెయ్యి బయటకు వస్తుందా?
Recommended image2
Purple Potato: మార్కెట్లోకి పర్పుల్ బంగాళదుంపలు.. వీటిని తింటే కలిగే లాభాలు ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved