Stomach Hurt : కడుపులో మంటతో ఇబ్బందిపడుతున్నారా? ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది..
Stomach Hurt : బీట్ రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ లు కడుపులో మంటను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. మసాలా ఫుడ్స్, వేపుళ్లు వంటివి కడుపులో నొప్పికి కారణమవుతాయి.

Stomach Hurt : మారుతున్న లైఫ్ స్టైల్, పీరియడ్స్ ముందు వచ్చే మార్పులు, వర్క్ ప్రెజర్, మానసిక ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యల కారణంగా కడుపులో నొప్పి కలుగుతుంది. అలాగే మసాలా ఫుడ్స్, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, కారం, ఉప్పు , సమయానికి తినకపోవడం వంటి కారణాల వల్ల కడుపులో నొప్పి పుడుతుంది.
కొలెస్ట్రాల్ కరగడానికి, కీళ్ల నొప్పులకు, తీవ్రమైన తలనొప్పికి వాడే మందుల కారణంగా కూడా కడుపులో నొప్పి పుడుతుంది. అలాగే నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రై చేసిన ఆహారాలు కూడా కడుపులో మంటను పుట్టిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా ఈ కడుపులో నొప్పి సమస్యతో బాధపడేవారు మజ్జిగ, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మలబద్దకం కారణంగా కూడా కడుపులో మంట పుడుతుంది. అంతేకాదు తిన్నది సరిగ్గా అరగకపోయినా కడుపులో మంట వస్తుంది. ఇలాంటి సమయంలో పులుపు, చేదు వంటి తేన్పులు వస్తాయి.
గాల్ బ్లాడర్, కిడ్నీ సమస్యలు, కాలేయం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కడుపులో మంట వస్తుంది. ఇలాంటి సమయంలో గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంట ఉన్నవారు పప్పు కూరలను తరచుగా తినకూడదు. పుల్లని పదార్థాలను, కూరలను అస్సలు తినకూడదు.
పాలల్లో ఉసిరిక పౌడర్ ను మిక్స్ చేసి తాగితే కడుపు మంట కొంత వరకు తగ్గుతుంది. బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ లు కడుపులో మంటను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
చిటికెడు వాములో పచ్చి అరటిని ఎండబెట్టిన పౌడర్ ను, చక్కెరను కలిపి తీసుకుంటే కూడా కడుపునొప్పి తగ్గుతుంది. జాజికాయ చూర్ణం చిటికెడు, నేలవాము చూర్ణాన్ని చిటికెడు తీసుకుని అందులో కాస్త తేనెను కలిపి తీసుకుంటే కూడా కడుపులో మంట తగ్గుతుంది. అయినా మంట తగ్గకపోతే.. వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లడం బెటర్.