మెరిసే ముఖం కోసం క్యారెట్ ఫేస్ ప్యాక్.. ఎలా ఉపయోగించాలంటే?
క్యారెట్ ఫేస్ ప్యాక్ ముఖంపై మెడతలను, నలుపుదనాన్ని పోగొడుతుంది. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ చనిపోయిన కణాలను కూడా తొలగిస్తుంది. దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

క్యారెట్లు ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని మన శరీరం చాలా సులువుగా గ్రహిస్తుంది. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా పోషకాలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇది చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. అలాగే ముడతలు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు మీ చర్మం అందంగా కనిపిస్తుంది కూడా.
<p>carrot</p>
క్యారెట్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల ముఖంపై ముడతలు, బ్లాక్ నెస్ తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ మృతకణాలను తొలగించి చర్మాన్ని పునరుత్తేజపరుస్తుంది. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ అదనపు నూనెను బయటకు పంపుతుంది. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే రంగును మెరుగుపరుస్తుంది. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా దూరం చేస్తుంది.
క్యారెట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల క్యారెట్ పేస్ట్ లో రెండు టీస్పూన్ల పాలు కలిపి ముఖానికి రాసుకుంటే సన్ టాన్ నుంచి బయటపడొచ్చు. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించొచ్చు.
skin care
క్యారెట్ ను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ లో పెరుగు, శనగపిండి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీటితో కడిగేయాలి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ చర్మంపై అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. ఆయిలీ ఫేస్ ఉన్నవారు ఈ ప్యాక్ ను ట్రై చేయొచ్చు.
skin care
పెరుగు, క్యారెట్ జ్యూస్, గుడ్డులోని తెల్లసొన సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.