brown eggs: వేసవిలో బ్రౌన్స్ ఎగ్స్ ను తినొచ్చా? లేదా? తింటే ఏమౌతుందంటే?
brown eggs: గుడ్డు సంపూర్ణ ఆహారం. వీటిలో ప్రోటీన్లు, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే గుడ్లను వేసవిలో తినడానికి చాలా మంది సందేహిస్తుంటారు. ఇంతకీ వేసవిలో గుడ్లను తినడంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

గుడ్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. గుడ్డును ఆమ్లేట్, గుడ్డు పులుసు, ఎగ్ కర్రీ వంటివి వివిధ రకాలుగా చేసుకుని లాగించేస్తుంటారు. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే రోజుకు కనీసం ఒక గుడ్డన్నా తినమని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు.
గుడ్డులో ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అయితే మార్కెట్ లో లభించే తెల్లగుడ్లను తినాలా? లేక బ్రౌన్ ఎగ్స్ ను తినాలా అన్న దానిపై సందేహాలు కలుగుతుంటాయి. అందులోనూ తెల్లగుడ్లకంటే బ్రౌన్ ఎగ్స్ యే ఎక్కువ ఖరీదైనవి. అయితే ఈ బ్రౌన్ ఎగ్స్ ను ఈ వేసవిలో తినొచ్చా లేదా అన్న దానిపై ప్రజలకు సందేహాలు కలుగుతుంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.
గోధుమ రంగు గుడ్లు, తెల్ల గుడ్ల మధ్యన తేడా ఉందా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రౌన్ ఎగ్స్ కు, తెల్ల గుడ్లకు వ్యత్యాసం లేదు. కానీ చాలా మంది మాత్రం బ్రౌన్ ఎగ్స్ ను తినడానికే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే ఈ బ్రౌన్ ఎగ్స్ కు తెల్లగుడ్లకు మధ్యనున్న ఏకైక వ్యత్యాసం కోళ్ల ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఇదే గుడ్ల రంగును, రుచిని నిర్ణయిస్తుంది.
బ్రౌన్ ఎగ్స్ ఎందుకు ఖరీదైనవి.. గోధుమ రంగు గుడ్లు మార్కెట్ లో చాలా ఎక్కువ రేట్లకు లభిస్తాయి. దీనికి కారణం కోళ్ల రకాల వ్యత్యాసం. ఒక డిజిటల్ జర్నల్లో ప్రచురింపబడిన వ్యాసం ప్రకారం.. కోళ్లకు పెట్టే ఆహారమే ఈ రెండు గుడ్లను వేరుగా చూడటానికి కారణం. తెలుపు ఇయర్లోబ్స్ ఉన్న కోళ్లు తెల్లగుడ్లు పెడతాయి. ఎరుపు ఇయర్లోబ్స్ తో ఎరుపు రెక్కల కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఎరుపు ఫెదర్ కోళ్లు పరిమాణంలో తెల్ల కోళ్లతో పోల్చితో పెద్దవిగా ఉంటాయి. వీటికి ఆహారం ఎక్కువగా వేస్తుంటారు. ఇది గుడ్ల రంగును, పరిమాణానాన్ని ప్రభావితం చేస్తుంది.
గోధురరంగు గుడ్లలో ఎన్ని కేలరీలు ఉంటాయి.. United Stated Department of Agriculture (USDA), ప్రకారం.. 100 గ్రాముల గోధుమ రంగు గుడ్డులో 12.56 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఎఫ్సిఎటిలో, ఒక పెద్ద గుడ్డులో(50 గ్రాములు) సుమారు 72 నుంచి 80 కేలరీలు, 4.75 గ్రాముల కొవ్వు ఉంటుంది. వీటిలో కేవలం 1.5 గ్రాముల సంతృప్త కొవ్వులు మాత్రమే ఉన్నాయి.
వేసవిలో గోధుమ రంగు గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. గోధుమ రంగు గుడ్లలో 72 నుంచి 80 కేలరీలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. వేసవిలో గుడ్లు తినడం వల్ల జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందనడం కేవలం మన అపోహమాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు వేడిని కలిగిస్తాయి. వీటిని తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందనేది వాస్తవమే అయినప్పటికీ.. వేసవిలో మితంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే ఒంట్లో వేడి పెరిగే అవకాశం కూడా ఏమీ ఉండదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను తినడం వల్ల మన ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం పడదు. ఒంట్లో వేడి కూడా పెరగదు. అయితే ఒంట్లో వేడి ఎక్కువగా ఉండే వారు మాత్రం గుడ్లలను తినాలనుకుంటే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే ఒంట్లో వేడి ఎక్కువైతే అసౌకర్యం, విరేచనాలకు దారితీస్తుంది.