MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fertility: జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరా? కేవలం అపోహేనా? పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..

Fertility: జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరా? కేవలం అపోహేనా? పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..

Fertility: రోజురోజుకు సంతాన లేమి సమస్యలు ఎక్కువవుతున్నాయి. లేట్ మ్యారేజెస్, లైఫ్ స్టైల్, ఆహారం ఇవన్నీ దీనికి ప్రధాన కారణాలు. కానీ వేసుకునే జీన్స్ వల్ల కూడా పిల్లలు పుట్టరని పరిశోధనలు చెప్తున్నాయి. మరి ఇది వాస్తవమేనా? కేవలం అపోహా?

2 Min read
Author : Nandini Arava
Published : Mar 24 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరా?
Image Credit : Asianet News

జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరా?

ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో సంతానలేమి అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎంత కారణమో, మనం వేసుకునే దుస్తులు కూడా అంతే రీజననే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా బిగుతుగా ఉండే జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరా? అనే సందేహం ఉంది. దీని వెనుక ఉన్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

26
దీర్ఘకాలంలో సమస్య తప్పదు
Image Credit : Getty

దీర్ఘకాలంలో సమస్య తప్పదు

చాలా మంది ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉండే బట్టలను ఎంచుకుంటారు. అసౌకర్యంగా ఉన్నా సరే వాటినే వేసుకుంటారు. రోజంతా అవే బట్టల్లో ఉండటం, రాత్రైనా సరే మార్చకపోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తప్పదు. ముఖ్యంగా సంతానలేమికి ఇదొక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Male Fertility: వేడి గాలుల వల్ల వీర్య కణాలు దెబ్బతింటాయా..!
Related image2
Fertility Diet: సంతానోత్పత్తి పెరగడానికి స్త్రీ, పురుషులు తినాల్సిన పండు ఇది..
36
వేసుకునే జీన్స్ కు సంతానోత్పత్తి మధ్య అసలు సంబంధం ఏమిటి?
Image Credit : our own

వేసుకునే జీన్స్ కు సంతానోత్పత్తి మధ్య అసలు సంబంధం ఏమిటి?

కేవలం జీన్స్ వేసుకోవడం వల్ల పిల్లలు పుట్టరు అనడం పూర్తిగా నిజం కాదు, కానీ బిగుతుగా ఉండే జీన్స్ అతిగా వేసుకోవడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 

46
వేడి పెరగడం
Image Credit : Getty

వేడి పెరగడం

పురుషులలో వీర్యకణాల ఉత్పత్తికి శరీర ఉష్ణోగ్రత కంటే 2°C నుండి 3°C తక్కువ ఉష్ణోగ్రత అవసరం. అందుకే వృషణాలు శరీరం బయట సంచిలాంటి నిర్మాణంలో ఉంటాయి. బిగుతుగా ఉండే జీన్స్ లేదా సింథటిక్ అండర్‌వేర్ ధరించినప్పుడు, వృషణాలు శరీరానికి దగ్గరగా నొక్కినట్లు ఉంటుంది. దానివల్ల గాలి ఆడక వేడి పెరుగుతుంది. దీంతో వీర్యకణాల సంఖ్య (Sperm Count) తగ్గడమే కాకుండా, వాటి కదలిక , ఆకృతి దెబ్బతింటాయి. 

56
ఇది కేవలం అపోహేనా?
Image Credit : Getty

ఇది కేవలం అపోహేనా?

అయితే మహిళల్లో జీన్స్ వల్ల నేరుగా సంతానలేమి కలగకపోయినా, బిగుతుగా ఉండే దుస్తుల వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి పరోక్షంగా పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 

జీన్స్ వేసుకుంటే అస్సలు పిల్లలు పుట్టరు అనేది కేవలం అపోహ మాత్రమే. కానీ బిగుతు దుస్తులు సంతానోత్పత్తిని తగ్గిస్తాయనేది వాస్తవం. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు. గంటల తరబడి కూర్చుని పని చేసేవారు, వేడి వాతావరణంలో ఉండేవారు బిగుతుగా ఉండే జీన్స్ వేసుకుంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

66
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : our own

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వీలైనంత వరకు కాటన్ దుస్తులు, వదులుగా ఉండే ప్యాంట్లు వేసుకోవడానికి ప్రయత్నించండి. రోజంతా బిగుతుగా ఉండే జీన్స్ కాకుండా ఇంటికి రాగానే లూజ్‍గా ఉండే బట్టలు వేసుకోండి. ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడవడం వల్ల శరీరంలో వేడి అదుపులో ఉంటుంది.

ఫ్యాషన్ కంటే శరీరానికి సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. సంతానలేమి సమస్య ఉన్నవారు జీవనశైలిలో ఇలాంటి చిన్న మార్పులు చేసుకోవడం మంచిదేగా.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?
Recommended image2
Gen Z Bald Head: పాపం.. జెన్ జీ మగాళ్లు బట్టతల బాబాయ్‌లుగా మారిపోతున్నారు, ఎందుకో తెలుసా?
Recommended image3
Silver Mangalsutra: వెండితో కొత్తరకం మంగళసూత్రాలు.. అదిరిపోతాయి
Related Stories
Recommended image1
Male Fertility: వేడి గాలుల వల్ల వీర్య కణాలు దెబ్బతింటాయా..!
Recommended image2
Fertility Diet: సంతానోత్పత్తి పెరగడానికి స్త్రీ, పురుషులు తినాల్సిన పండు ఇది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved