Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..
Calcium Rich Foods: ఒక వ్యక్తి రోజుకు కనీసం 1,000 మిల్లీ గ్రాముల కాల్షియాన్ని తీసుకుంటే ఎముకలు బలంగా ఉండటంతో పాటుగా.. ఎముకలకు సంబంధించి ఎలాంటి రోగాలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. కాల్షియం ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒంట్లో కాల్షియం తక్కువగా ఉంటే కీళ్ల నొప్పులు, అవయవాల అలసట, నాడీ సంబంధిత వ్యాధులు, వెన్నునొప్పి వంటి ప్రమాదరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కనీసం1000 మిల్లీగ్రాముల కాల్షియాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి.
అయితే వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. దీనివల్ల నడవక పోవడం, ఎక్కువ సేపు నిలబడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఎముకలను బలంగా ఉంచేందుకు, ఎముకలకు సంబంధించిన రోగాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కాల్షియం ఎంతో సహాయపడుతుంది. మరి ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి? వేటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు (curd)
పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. క్రమం తప్పకుండా ఒక కప్పు పెరుగుతున్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
నువ్వులు, చియా విత్తనాలు (Chia seeds)
శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో నువ్వులు, చియా విత్తనాలు ముందుంటాయి. ఈ రెండింటిలో కాల్షియం పుష్కలంగా ఉండటమే కాదు.. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
సోయాబీన్స్ (Soybeans)
సోయాబీన్స్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాముల సోయాబీన్స్ ద్వారా మన శరీరానికిక 27 శాతం కాల్షియం అందుతుంది.
ఆకు కూరలు (Leafy vegetables)
ఆకు కూరల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఆకు కూరలను రెగ్యులర్ గా తినడం శరీరానికి కావాల్సిన కాల్షియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాల లభిస్తాయి. అందులోబ్రోకలి, బచ్చలికూర, మోరింగా కూరలను తప్పకుండా తినాలి.
బాదం పప్పులు (Almonds)
బాదం వంటి డ్రై ఫ్రూట్స్ లో పోషకాలకు కొదవే ఉండదు. 100 గ్రాముల బాదం పప్పుల ద్వారా మనకు సుమారుగా 260 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో తప్పకుండా చేర్చాలి.
మునగ ఆకులు (Moringa leaves)
మునగ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరిగడుపున 1 టీస్పూన్ మునగ ఆకుల పొడిని తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఉసిరి (amla)
ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయను పొడిగా లేదా జ్యూస్ గా చేసుకుని కూడా తాగొచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.