Home prices: ఇల్లు కొనడం, కట్టడం ఇకపై సులువు.. జీఎస్టీ వల్ల ధరలు తగ్గబోతున్నాయి
ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు జీఎస్టీ మార్పుల వల్ల తగ్గబోతోంది. కాబట్టి ఇల్లు కొనాలనుకునేవారు లేదా కట్టాలనుకునేవారు. కొత్త జీఎస్టీ స్లాబులు వచ్చాక ప్రారంభించడం మంచిది.

జీఎస్టీ ఫలితాలు
ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. కొంతమంది అపార్ట్మెంట్స్ కొనుక్కుంటే మరికొందరు స్థలంలో ఇల్లు నిర్మించుకుంటారు. ఇకపై ఏదైనా కూడా ధరలు తగ్గబోతున్నాయి. దీపావళికి ముందు ఇల్లు కొనాలనుకునే వారికి లేదా నిర్మించుకునే వారికి జీఎస్టీ లో మార్పుల వల్ల పెద్ద బహుమతి లభించబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో సిమెంటు, స్టీల్ పై జిఎస్టిని తగ్గించారు. అంటే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల అపార్ట్మెంట్ ధరలు కూడా తగ్గబోతున్నాయి.
జీఎస్టీ పన్ను తగ్గించి
నిర్మాణ సామాగ్రిపై 28 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అది 18 శాతానికి తగ్గిపోయింది. దీని వల్ల ఇంటి ధరపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఇది ఇల్లు కొనడాన్ని కూడా సులువుగా మార్చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ వృద్ధి కనిపించే అవకాశాలు ఉన్నట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
సిమెంట్, స్టీలు ధరలు తక్కువగా
ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో 40 శాతం సిమెంటు, స్టీల్ ధరలకే ఖర్చవుతుంది. అయితే ఈ రెండు ధరలు కూడా తగ్గడం వల్ల ఇంటి ధరలు రెండు నుంచి మూడు లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 50 లక్షల రూపాయలు విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే అది మీకు 47 లక్షల రూపాయలకే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాలరాయి, గ్రానైట్
కేవలం సిమెంటు, స్టీలు మాత్రమే కాదు. ఇంటి నిర్మాణానికి వాడే పాలరాయి, గ్రానైట్ వంటి వాటిపై పన్నులు తగ్గాయి. గతంలో వీటిపై పన్ను 12 శాతంగా ఉండేది. ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు. దీనివల్ల ఇంటి ధరలో మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజ
పండగ సీజన్లో జీఎస్టీలో తగ్గడం వల్ల ప్రజలు ఇల్లు కొని ఆలోచనలలో ఎక్కువ చేస్తారు. అలాగే ఇల్లు నిర్మించాలని కూడా ఆశపడతారు. ఈ పన్ను తగ్గింపు అనేది వారికి అదనంగా కలిసి వస్తుంది. ఇల్లు చౌకగా మారితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.