Cholesterol dissolving: మైనంలా కొవ్వును కరగదీసే అద్భుతమైన పానీయం, అది కూడా చవక ధరకే
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. అలాంటివారు ప్రతిరోజు మజ్జిగ తాగేందుకు ప్రయత్నించండి. ఇది మీ కొవ్వును మైనంలా కాల్చిపడేస్తుంది. మీరు త్వరగా కొలెస్ట్రాల్ ను వదిలించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ కరిగించే పానీయం
చెడు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అధికంగానే ఉన్నారు. వారు ఆ కొలెస్ట్రాల్ ను ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పెడతారు. నిజానికి చాలా చవకగా మీరు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. రోజుకు ఒక గ్లాసు మజ్జిగ తాగినందుకు ప్రయత్నించండి. మజ్జిగ మీ శరీరంలోని కొవ్వును మైనంలా కాల్చిపడేస్తుంది. కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మజ్జిగ మీకు బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా సమర్థిస్తున్నారు.
మజ్జిగతో బరువు తగ్గొచ్చు
వైద్యులు చెప్పిన ప్రకారం మన శరీరంలో పేగు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పేగులోనే జీవక్రియకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ పేగులను కాపాడుతుంది. మజ్జిగలో కూడా జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉంటాయి. అలాగే కొవ్వును వేగంగా కరిగించే శక్తి కూడా ప్రోబయోటిక్స్ కి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మజ్జిగ తాగడం వల్ల మీరు బరువు సులువుగా తగ్గుతారు.
మజ్జిగలో పోషకాలు ఎక్కువ
మజ్జిగలో పోషకాలు కూడా ఎక్కువ. ముఖ్యంగా దీని ధర చాలా తక్కువ. పేద మధ్యతరగతి వారికి కూడా మజ్జిగ అందుబాటులో ఉంటుంది. రెండు స్పూన్ల పెరుగు వేసి నీళ్లు కలిపితే చాలు మజ్జిగ సిద్ధమైపోతుంది. ఈమధ్యలో కాల్షియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ బి12 వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల 110 క్యాలరీల శక్తి వస్తుంది. తొమ్మిది గ్రాముల ప్రోటీన్ కూడా అందుతుంది. కాబట్టి మజ్జిగ సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవాలి.
ఈ సమస్య ఉన్నవారికి
ఎంతోమందికి పాలలో పెరుగులో ఉండే లాక్టోస్ అరిగించుకునే శక్తి తక్కువైపోతుంది. అలాంటి వారికి మజ్జిగ సులువుగా అరిగిపోతుంది. పాల వల్ల వచ్చే గ్యాస్, అజీర్ణం సమస్యలు మజ్జిగతో రావు. కాబట్టి లాక్టోజ్ సెన్సిటివిటీ ఉన్నవారు మజ్జిగను తాగడం వల్ల మీ శరీరం చల్లబడుతుంది.
మజ్జిగతో పొట్ట సమస్యలు తగ్గుతాయి
జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా మజ్జిగను ప్రతిరోజు తాగాల్సిన అవసరం ఉంది. ఇందులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పొట్ట సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే యాంటీబయోటిక్స్ తీసుకున్నప్పుడు శరీరం బలహీనంగా ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం జరుగుతాయి. అలాంటప్పుడు మీరు మజ్జిగ తాగితే పేగులు లోపల నుండి శుభ్రపడతాయి.