Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ లు తీసుకుంటే మంచిది..?
Diabetes: షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే మధుమేహులు ఆహారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.. వాటిని తీసుకోవాలా? వద్దా? అని..

Diabetes: ప్రమాదకరమైన రోగాల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారిన పడితే.. దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. అందుకే ఈ పేషెంట్లు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా.. రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
అయితే మధుమేహులు కొన్నిరకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకుంటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే చాలా మంది మధుమేహులు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి తినాలి? ఏమి తినకూడదు? అన్న విషయాలను అనుమానం ఉంటుంది. అయితే కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు రక్తంలో షుగర్ లో నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఉప్మా.. ఓట్స్ మధుమేహులకు దివ్య ఔషదం లాంటిది. వీటితో చేసి ఏ ఫుడ్ అయినా సరే షుగర్ పేషెంట్లకు మంచే చేస్తుంది. వీరు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ఉప్మా ను తింటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఈ ఉప్మాలో వెజిటేబుల్స్ ను వేసుకుని తయారుచేసుకోవచ్చు. ఉడకబెట్టిన ఓట్స్ లో నట్స్, మిల్క్ కలుకుని తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోధుమ రవ్వ ఉప్మా.. షుగర్ పేషెంట్లకు గోధుమ రవ్వ ఉప్మా చాలా మంచిది. ఈ ఉప్మాలో జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి Nervous system కు ఎంతో అవసరం కూడా. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ డయాబెటీస్ పేషెంట్లకు అత్యవసరం. ఈ ఉప్మాని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఈ ఉప్మాలో క్యారెట్, బీన్స్ వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి కూడా వస్తుంది.
పెసరట్టు.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు మధుమేహులకు ఎంతో మంచివి. ఇది మధుమేహులను శక్తివంతంగా ఉంచుతాయి. కాగా ఫైబర్ పెసరపప్పులో పుష్కలంగా ఉంటుంది. మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సా హంగా ఉంటారు.
రాగి దోశ.. రాగులు మధుమేహులతో పాటుగా ఇతరులకు కూడా మేలు చేస్తాయి. వీటిని ఎలా తీసుకున్నా.. అధిక బరువు నుంచి బయటపడొచ్చు. ఇక డయాబెటీస్ పేషెంట్లు రాగి జావ లేదా రాగి దోశ వంటవి తీసుకోవడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. రాగులతో చేసిన వంటకాలను తినడం వల్ల నీరసమే రాదు.
మధుమేహులు ప్రతిరోజూ కప్పు పెరుగు తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీరు బోండాలు, దోశ, ఇడ్లి వంటివి తినడం మంచిది కాదు. వీటిని తింటే అనారోగ్య సమస్యలు రావొచ్చు. బోండాల్లో మైదా, ఇడ్లి, దోశల్లో బియ్యాన్ని కలుపుతుంటారు. వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.