brain boosters food: బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది..
brain boosters food: బ్రేక్ ఫాస్ట్ లో కాఫీ, గుడ్డు, నారింజ, బ్రోకలి వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది.

brain boosters food: శరీరాన్ని ఫిట్ గా ఉంచడం ఎంత అవసరమో.. బ్రెయిన్ ను కూడా అంతే ఫిట్ గా ఉంచడం అవసరం. ఎందుకంటే మన బాడీకి పని అప్పజెప్పేది బ్రెయినే కాబట్టి. మరి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటేనే.. చాలా చురుగ్గా స్పందించగలదు.
అయితే చాలా మంది బ్రెయిన్ ను షార్ప్ గా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సరైన ఫుడ్ ను మాత్రం తీసుకోరు. మీకు తెలుసా.. మనం తీసుకునే ఆహారం కానీ పానీయాలు గానీ మన శరీరంపైనే కాదు మనసు పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా మీరు పోషకాహారం తీసుకోకపోతే మీ బ్రెయిన్ బలహీనంగా మారుతుంది.
కాబట్టి బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలంటే మంచి పోషకవిలువలున్న ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కాఫీ.. బ్రేక్ ఫాస్ట్ లో కాఫీని కూడా చేర్చుకోవచ్చు. నిజానికి కాఫీలో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజంగా చేయడంతో పాటగా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అంతేకాదు కాదు ఇవి బ్రెయిన్ అప్రమత్తతను కూడా వేగవంతం చేస్తాయి. అలాగే మీ ఏకాగ్రతను కూడా పెంచుతాయి.
పసుపు.. పసుపు సర్వరోగ నివారిణి అని అందరికీ తెలుసు. ఇది ఎన్నో వ్యాధులను నయం చేయగలదు. అలాగే బ్రేయిన్ పనితీరును వేగవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు పసుపు మెదడు కణాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. పసుపును తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మీ రోజు వారి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.
గుడ్లు.. గుడ్డు సంపూర్ణ ఆహారం. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు బి6 నుంచి బి 12 వరకు పుష్కలంగా ఉంటాయి. మీ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డను తినడం వల్ల మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా దీన్ని ఉదయం పూట తీసుకోవడం వల్ల మెదడు చాలా షార్ప్ గా పనిచేస్తుంది.
ఆరెంజ్.. నారింజ పండ్లను కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తికి పెంచడంతో పాటుగా మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది కూడా.
వాల్ నట్స్, బాదం పప్పులు.. బ్రేక్ ఫాస్ట్ లో వాల్ నట్స్, బాదం పప్పులను తిన్నా బ్రెయిన్ శక్తి పెరుగుతుంది. అలాగే మెదడును దెబ్బతీసె కణాలతో ఇవి పోరాడతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో పాటుగా బ్రోకలీని కూడా బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు. ఇది బ్రెయిన్ పనితీరును వేగవంతం చేస్తుంది.