ఈ నూనెలు శరీర నొప్పులను తగ్గించడమే కాదు.. ఎముకలను కూడా బలంగా చేస్తాయి..
bone strengthening oil tips: ఎముకలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీరం అన్ని విధాల బాగుంటుంది. అయితే ఎముకలను బలంగా ఉంచేందుకు కొన్నిరకాల నూనెలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ నూనెలు శరీర నొప్పులను కూడా తగ్గిస్తాయి. అవేంటంటే..

bone strengthening oil tips: ప్రస్తుత కాలంలో ఎముకలు బలహీనపడటం సర్వ సాధారణ సమస్యగా మారింది. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి అలవాట్లు కూడా ఎముకలను బలహీనంగా మారుతున్నాయి.
శరీరానికి కావాల్సిన పోషకాలు లభించనప్పుడు లేదా అతిగా వ్యాయామాలు చేయడం వంటి కారణాల వల్ల కూడా ఎముకలు బలహీనంగా మారుతాయి. అందుకే యువత కూడా బలహీనమైన ఎముకల సమస్య బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల నూనెలు ఎముకల నొప్పిని తగ్గించడంతో పాటుగా.. దృఢంగా మార్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.
castor oil
ఆవనూనె.. ఆవనూనె ఎముకలను బలంగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ నూనె శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా జాయింట్ పెయిన్ ను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ నూనె రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
బాదం నూనె.. బాదం నూనె మీ ఎముకలను బలంగా, ధ్రుడంగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఆల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి మన చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఈ కూడా ఉంటుంది. అంటే ఈ నూనెను ఎలాంటి భయాలు లేకుండా శరీరానికి మసాజ్ చేసుకోవచ్చు.
నువ్వుల నూనె.. వీటితో పాటుగా నువ్వుల నూనెను కూడా శరీరానికి మసాజ్ చేసుకోవచ్చు. ఈ నూనెను తరచుగా బాడీకి అప్లై చేయడం వల్ల బాడీ అందంగా మారుతుంది.
ఆలివ్ ఆయిల్.. ఆలివ్ ఆయిల్ ఏ నూనె కంటే తక్కువ కాదు. దీనిని ఉపయోగించడం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఈ నూనెను శరీరానికి అప్లై చేసి మసాజ్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది. విశ్రాంతిని కూడా కలిగిస్తుంది.
ఇవి కూడా.. ఎముకలను బలంగా చేయడానికి పాలకూర కూడా ఎంతో సహాయపడుతుంది. దీనిలో మెగ్నీషియం, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పాలకూర మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే ఎముకలను కూడా బలంగా తయారుచేస్తుంది.
కీరదోస.. ఈ పండులో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా ఎముకలను బలోపేతం కూడా చేస్తాయి. అంతేకాదు ఇవి మీకు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.