MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • blood pressure: ఈ 4 పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. బీపీ ఇట్టే కంట్రోల్ లోకి వస్తుంది..

blood pressure: ఈ 4 పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. బీపీ ఇట్టే కంట్రోల్ లోకి వస్తుంది..

blood pressure: కొన్ని పండ్లు రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2022, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజులో అధిక రక్తపోటు, బీపీ కంట్రోల్ లో లేకపోవడం( తగ్గడం లేదా పెరగడం) సర్వ సాధారణంగా మారిపోయింది. వాస్తవానికి మారుతున్న జీవనశైలి, పేలవమైన ఆహారం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య బారిన పడతారు. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ బీపీని కంట్రోల్ లో ఉంచడానికి కొన్ని రకాల పండ్లు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 

26

కివీ.. అధిక రక్తపోటును నియంత్రించడానికి కివీ ఎంతో సహాయపడుతుంది. దీన్ని మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరంగా ఉంచుతుంది. ఈ పండును వారానికి ఒక సారి తిన్నా మీ ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవే బీపీని నియంత్రణలో ఉంచుతాయి. దీన్ని జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 
 

36

అరటి పండ్లు.. అరటి పండ్లు కూడా బీపీని నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిది. ఈ పండులో పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. 

46

పెరుగు..  పెరుగు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో అధిక రక్తపోటును నియంత్రించే లక్షణాలున్నాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. 
 

56

చిలగడదుంప.. చిలగడదుంపలో బీపీని నియంత్రించే గుణాలుంటాయి. ఇందులో బీటా కెరోటిన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

66

స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలు కూడా బీపీని నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.  ఇవే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Recommended image2
Bitter Gourd: కాకరకాయతో ఈ 7 లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!
Recommended image3
Gut Health: పేగుల ఆరోగ్యం కోసం ఈ 7 పండ్లు తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved