వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి
వర్షంలో బైక్ నడపడం రిస్కీ. స్కిడ్ అవకుండా స్పీడ్ తగ్గించి, బ్రేక్స్ జాగ్రత్తగా వాడి, ఇతర వాహనాలకి దూరం పాటించాలి. గుంతల రోడ్లపై కూడా జాగ్రత్త. ఇలా వర్షంలో బైక్ నడిపేటపుడు పాటించాల్సిన సేప్టీ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వర్షాకాలంలో బైక్ డ్రైవింగ్ చిట్కాలు
Bike Riding Tips in Rainy Season: వర్షాకాలం బైక్ నడపడం చాలా కష్టం. రోడ్డు మీదకు బైక్ పై వెళ్ళాలంటే పెద్ద సవాలులా ఉంటుంది. రైడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తడి రోడ్ల మీద స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటప్పుడు బైక్ మీద కంట్రోల్ పోయి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు కంట్రోల్ చాలా ముఖ్యం.
1. బైక్ ఎంత స్పీడ్ లో నడపాలి?
తడి రోడ్ల మీద బైక్ తీసుకెళ్లేటప్పుడు ముందుగానే స్పీడ్ కంట్రోల్ గురించి ఆలోచించాలి. వర్షాకాలంలో బైక్ స్పీడ్ 30 నుంచి 40 kmph మధ్యలో ఉండాలి. ఇంత స్పీడ్ లో బైక్ కంట్రోల్ తప్పినా స్కిడ్ అయ్యే అవకాశం తక్కువ. అంటే మీరు పడే ప్రమాదం తక్కువ. ఈ స్పీడ్ మీకు సేఫ్ జర్నీ ఇస్తుంది.
2. బ్రేక్స్ సరిగ్గా వాడాలి
తడి రోడ్ల మీద బ్రేక్స్ వేస్తే బైక్ స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అందుకే బ్రేక్స్ మీద సరిగ్గా కంట్రోల్ ఉంచుకోవాలి. సడన్ గా కాకుండా మెళ్ళిమెళ్లిగా బ్రేక్ వేయాలి, తక్కువ స్పీడ్ లో బైక్ ను కంట్రోల్ ఉంచుకోవాలి. సడన్ బ్రేక్ వల్ల కంట్రోల్ తప్పి బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది.
3. ఇతర వాహనాలతో దూరం పాటించాలి
వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు ముందు వెళ్తున్న వాహనాల గురించి కూడా ఆలోచించాలి. ఇతర వాహనాలకి సరైన దూరం పాటించాలి, నెమ్మదిగా నడపాలి. అలా చేస్తే ఈజీగా బ్రేక్ వేయొచ్చు. ముందు వెళ్తున్న వాహనాలకి దూరం పాటిస్తే హఠాత్తుగా బ్రేక్ వేయాల్సిన అవసరం రాదు, సేఫ్ గా జర్నీ చేయొచ్చు.
4. రోడ్డు మీద గుంతలతో జాగ్రత్త
చాలా సార్లు వర్షం వల్ల రోడ్డు మీద గుంతలు నీళ్లతో నిండిపోతాయి, వాటి లోతు సరిగ్గా తెలియదు. అందుకే ఎప్పుడూ గుంతలకి దూరంగా ఉండాలి.ఇలాంటి గతుకుల రోడ్లపై వెళ్లాల్సి వస్తే నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాలి. గుంతలు మరీ ఎక్కువగా ఉంటే రిస్క్ తీసుకోకుండా గమ్యం కాస్త దూరమైనా వేరే దారిలో వెళ్లడం మంచిది.