రోజూ కొన్ని నిమిషాలు సైకిల్ తొక్కితే ఇన్ని లాభాలా !
Bicycling Health Benefits: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైక్లింగ్ సులభమైన మార్గాలలో ఒకటి. సైక్లింగ్ ఎన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాయామం చేయడానికి సులభమైన మార్గం సైక్లింగ్
Bicycling Health Benefits: ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఎక్కువ ఖర్చు లేకుండా సైక్లింగ్ చేయవచ్చు. అంతేకాకుండా, చాలా మందికి సైక్లింగ్ ఎలా చేయాలో తెలుసు. ఎందుకంటే ఒక్కసారి సైకిల్ నేర్చుకుంటే మర్చిపోరు. దానికి తోడూ అనేక లాభాలు కూడా ఉన్నాయి.
బలం-కండరాలను ధృఢంగా మారుస్తుంది..
సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లకు మాత్రమే కాదు.. శరీరం మొత్తం వ్యాయామం చేసేలా చేస్తుంది. సైక్లింగ్ చేసేటప్పుడు శరీరంలోని ప్రతి భాగం పాల్గొంటుంది, కాబట్టి సైక్లింగ్ ఒక పూర్తి శరీర వ్యాయామం.
సైక్లింగ్ కండరాల పనితీరును క్రమంగా మెరుగుపరుస్తుంది. ఎక్కువ వ్యాయామం చేసేటప్పుడు కూడా కొద్దిగా అసౌకర్యం కలిగించవచ్చు. అయితే, క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. తుంటి, మోకాలి కీళ్ల కదలిక మెరుగుపడుతుంది.
సైక్లింగ్ సహనశక్తిని పెంపొందించడానికి ఒక గొప్ప మార్గం. ఎందుకంటే సాధారణంగా చాలా మంది సైక్లింగ్‌ను ఆనందిస్తారు. ఫిజికల్ ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
సైక్లింగ్ గుండెను స్థిరంగా కొట్టుకునేలా చేస్తుంది. కార్డియో-వాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొద్ది సమయం సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం 3-7% పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కేలరీలు బర్న్ చేస్తుంది
బరువు తగ్గడానికి కూడా సైక్లింగ్ ఒక గొప్ప మార్గం. గంట సేపు సైక్లింగ్ చేస్తే మన శరీరంలో దాదాపు 300 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజు 30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే, ఒక సంవత్సరంలో 5 కిలోల అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, వారానికి 20 మైళ్లు సైక్లింగ్ చేయడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 50% తగ్గుతుంది.
సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది
సైక్లింగ్ అనేది మొత్తం శరీరాన్ని వ్యాయామంలో ఉంచే ఒక చర్య. కాబట్టి, చేతులు, కాళ్లు, కళ్లు, శరీరం మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుంది. ఏదైనా సాధారణ వ్యాయామం ఒత్తిడి, నిరాశను తగ్గిస్తుంది. బయట సైక్లింగ్ చేయడం అనేది ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి, తాజా గాలిని పీల్చుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఒకరి మనస్సును రోజువారీ జీవిత ఒత్తిడి నుండి బయటపడేలా చేస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది.