Betel Leaf Benefits: ఫస్ట్ నైట్ రోజు పురుషులు తమలపాకులు (పాన్) తినేది అందుకేనట..
Betel Leaf Benefits:పూజలు, పెళ్లిళ్లు, పేరంటాలకులకు తమలపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ తమలపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది పురుషుల్లో లైంఘిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుందట. అందుకే ఆ రోజు వీటిని తింటారట.

Betel Leaf Benefits: శుభకార్యం చిన్నదైనా పెద్దదైనా దాంట్లో తమలపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. మన దేశంలో ఈ ఆకును పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కదా పూజలో, పెళ్లిళ్లకు, పేరింటాలకు వీటిని ఎక్కువగా ఉపయోగించేది. ఇకపోతే పూర్వకాలంలో చాలా మంది ఈ తమలపాకును రోజూ తినేవారట. తమలపాకు రసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాగా తమలపాకుతో తయారుచేసిన పాన్ ను శోభనం రోజున పెళ్లికొడుకులు తింటారట. దీనికి కారణాలు లేకపోలేదు. మరి ఈ పాన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
లైంఘిక సామర్థ్యం: లైంఘిక సామర్థ్యాన్ని పెంచడానికి తమలపాకులు ఎంతో సహాయపడతాయట. అందుకే శోభనం రోజు వీటితో చేసిన పాన్ ను తింటారు. కాగా తమలపాకులో Anti-inflammatory, డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో Testosterone hormone levels పెరుగుతాయి. తద్వారా వారిలో లిబిడో ఎక్కువవుతుంది. ఇది మగవారిలో Sexual energy ని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు తమలపాకు పాన్ తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు.
తమలపాకుతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. ముఖ్యంగా తమలపాక్ పాన్ ను తిన్న తర్వాత నమిలితే మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందట. అంతేకాదు జీర్ణం కూడా తొందరగా అవుతుందట.
ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత తమలపాకు పాన్ తీసుకోవడంతో హార్ట్ లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదట. అందుకే చాలా ప్రాంతాల్లో తిన్న వెంటనే ఈ తమలపాకు పాన్ తింటుంటారు.
తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని గాయాలను నయం చేయడానికి వాడుతూ ఉంటారు. ఎవరైనా గాయపడితే వెంటనే తమలపాకు నుంచి రసాన్ని పిండి గాయంపై పూయండి. తర్వాత దానిపై తమలపాకు పెట్టి కట్టు కడితే గాయం తొందరగా నయమవుతుంది.
మలబద్దకంతో బాధపడేవారికి తమలపాకు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారు భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే ఈ సమస్యనుంచి బయటపడతారు. అలాగే ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో తమలపాకును చిన్న చిన్నముక్కలుగా చేసి వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరిగడుపున తాగాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.