కిచెన్ లో ఉండే ఈ ఒక్కదాంతో తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది
తలనొప్పి చిన్న సమస్యే అయినా ఇది ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి అయితే రెండు రోజుల వరకు కూడా తలనొప్పి వస్తూనే ఉంటుంది. అయితే మన వంటింట్లో ఉండే వస్తువుతో దీన్ని సులువుగా తగ్గించుకోవచ్చు.

తలనొప్పి
ఈ రోజుల్లో తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆకలి, అలసట, స్ట్రెస్, జలుబు వంటి ఎన్నో కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి కొన్ని ప్రమాదకరమై వ్యాధులకు సంకేతం కూడా. అందుకే తలనొప్పి విపరీతంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. ఇకపోతే అప్పుడప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు మనమందరం ట్యాబ్లెట్లను వాడుతుంటాం. కానీ ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ట్యాబ్లెట్ ను వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
తలనొప్పి
నిజం చెప్పాలంటే జలుబు, గ్యాస్, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోవడానికి మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు బాగా ఉపయోగపడతాయి. మీకు కూడా అప్పుడప్పుడు వచ్చే తలనొప్పిని కూడా మెడిసిన్ లేకుండానే తగ్గించుకోవచ్చు. అదికూడా కిచెన్ లో ఉండే వస్తువుతో. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తలనొప్పిని తగ్గించే టీ
తలనొప్పిని తొందరగా తగ్గించడానికి అల్లం టీ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో జింజెరాల్ ఉంటుంది. దీనిలో శోథనిరోధక లక్షణాలుంటాయి. ఇది తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొన్ని నీళ్లను తీసుకుని అందులో చిన్న అల్లం ముక్కను, చిటికెడు ఉప్పును వేసి మరిగించి వడకట్టి తాగండి. దీనివల్ల తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
జలుబు, దగ్గుకు అల్లం టీ
దగ్గు, జలుబును తగ్గించడంలో అల్లం టీ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అల్లం టీని తాగితే నరాలలో మంట తగ్గుతుంది. నొప్పి తగ్గిపోతుంది. అల్లంలో నొప్పి నివారణా లక్షణాలుంటాయి. ఇది కడుపు నొప్పి, తలనొప్పి రెండింటిని తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా సార్లు డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు అల్లం టీని తాగితే మీ శరీరంలో ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి.
అల్లం టీ
అల్లంలో ఉండే ఔషదలక్షణాలు కడుపు సమస్యల వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు అల్లం టీని రోజుకు ఒకటిరెండు సార్లు తాగొచ్చు. ఈ టీ పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది కూడా. ఈ టీ మీ శరీరాన్ని వేడి చేసి దగ్గు, జలుబు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది కేవలం అల్లం టీనే అయినా తలనొప్పిని తగ్గిచడంలో మాత్రం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే హైబీపీ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఈ అల్లం టీ పనిచేయదు.