mothers day 2022: మదర్స్ డే నాడు మీ అమ్మను ఇలా సర్ ప్రైజ్ చేయండి.. చాలా ఆనందపడుతుంది..
mothers day 2022: ఈ ప్రపంచంలో అతి చిన్న, అత్యంత విలువైన పదం ఏదైనా ఉందంటే అది ‘అమ్మ’ అనే పదమే. అమ్మే ఈ లోకంలో ఉన్న విలువైన, అత్యంత శక్తివంతమైదని. మరి ఈ అమ్మ కోసం మదర్స్ డే నాడు ఎలా సర్ ప్రైజ్ చేద్దామనుకుంటున్నారు.

mothers day
mothers day 2022: అమ్మ ఓ వరం. ఓ అద్భుతం.. ఓ అనురాగం, అనుబంధం.. తాను లేనిదే ఈ భూమ్మీద జీవం లేదు. తానంటూ ఒక్కతి ఉందన్న సంగతి మర్చిపోయి పిల్లలే సర్వస్వంగా బతికేటోళ్లు ఈ లోకంలో అమ్మ తప్ప మరెవ్వరూ ఉండరు. ఉండబోరు కూడా. అందుకే అమ్మను దేవుడితో సమానంగా కొలుస్తారు.
mothers day
అలాంటి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఏడేడు జన్మలెత్తిగా సరిపోవేమో కదా. తల్లి ప్రేమ అమరం. తల్లిలా మనల్ని ఎవరూ ప్రేమించరు. అలాంటి తల్లికి ఈ మదర్స్ డే సందర్బంగా ఎలా సర్ ప్రైజ్ చేద్దామనుకుంటున్నారు. ఇంత ప్రత్యేకమైన రోజున మీ అమ్మను సంతోషపెట్టడానికి టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
కలిసి భోజనం చేయడం.. ఈ గజిబిజీ లైఫ్ లో కలిసి తినడం అనే పదమే మర్చిపోయారు. కలిసి తినడంలో వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేము. ప్రతి తల్లి తమ పిల్లలతో కలిసి తినాలని ఎంతో ఆశపడుతుంది. కాబట్టి ఆ రోజున మీ అమ్మను మంచి హోటల్ కు తీసుకెళ్లి ఆమెకు ఇష్టమైన ఆర్డర్ చేసి తినండి. ఇది మిమ్మల్ని మళ్లి చిన్నపిల్లాడిని చేస్తుంది.
కలిసి పచ్చబొట్టు వేయించుకోండి.. పచ్చబొట్టు కేవలం ఒక మచ్చే కాదు.. మర్చిపోలేని గుర్తు కూడా. తల్లీ-కూతురు, తల్లీ-కొడుకుల మధ్య ప్రత్యేక బంధాన్ని చూపించడానికి ఇది గొప్ప మార్గం. పచ్చబొట్లు చాలా మందికి మంచి గుర్తుగా మిగిలిపోతాయి. ముఖ్యంగా ఒకేవిధమైన పచ్చబొట్టును కలిసి వేయించుకున్నప్పుడు అది ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తుంది. ప్రేమకు, అనుబంధానికి, ఆప్యాయతకు గుర్తుగా గుర్తిండిపోతాయి.
బయటకు వెళ్లండి.. మండుతున్న ఎండలకు పచ్చగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. అందుకే స్నేహితులతో కలిసి పర్వతప్రాంతాకు వెళుతుంటారు. కానీ మదర్స్ డే సందర్బంగా మీ ఫ్రెండ్స్ తో కాకుండా మీ అమ్మతో వెల్లండి. అమ్మను ఆలయానికి తీసుకెళ్లినా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇష్టమైన పాటలు వింటూ మీ అమ్మతో నవ్వుతూ ముచ్చట పెడుతుంటే వచ్చే ఆనందం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా రాదేమో.
అమ్మతో కలిసి సినిమా చూడండి.. ఎవరితోనైనా సంతోషంగా గడపడానికి సినిమాలు ఉత్తమ మార్గం. కాబట్టి ఈ మదర్స్ డేకు మీ అమ్మను మంచి సినిమాకు తీసుకెళ్లండి. మీరు మీ ఫ్రెండ్స్ తో లేదా మీ భార్యా పిల్లలతో చూస్తుంటారు కానీ.. తల్లితో మాత్రం చూడరు. కాబట్టి ఈ మదర్స్ డే కు మీ మదర్ తో కలిసి మూవీ చూడండి. ఆమె ఎంతో సంతోషిస్తుంది.
షాపింగ్ చేయండి.. చాలా మంది ఆడవారు వయసుతో సంబంధం లేకుండా షాపింగ్ ను తెగ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ సండేనాడు మీ అమ్మతో టైం స్పెండ్ చేయడానికి ఆమెను షాపింగ్ కు తీసుకెళ్లండి. అంతేకాదు మీరే ఆమెకోసం మంచి బట్టలను సెలక్ట్ చేయండి. ఆమె కళ్లల్లో కనిపించే సంతోషాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు.