High Blood Pressure: ఈ పండ్లను తింటే బీపీ నార్మల్ అవుతుంది..
High Blood Pressure: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా నేడు ఎంతో మంది అధిక రక్తపోటు (High Blood Pressure)సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఇది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది.

High Blood Pressure: ఈ రోజుల్లో అధిక రక్తపోటు (High Blood Pressure)సమస్య సర్వ సాధారణంగా మారిపోయింది. అంతేకాదు చిన్న వయసు వారు సైతం దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు (Heart attack), బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke) వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీ ఆహారంలలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు హైబీపిని నార్మల్ చేయడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ (Watermelon):వేసవిలో ఈ పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వేసవి దాహాన్ని తీర్చడంతో పాటుగా బాడీని హైడ్రెట్ గా ఉంచుతాయి. పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఔషదం కంటే తక్కువేమీ కాదనే చెప్పాలి.
స్ట్రాబెర్రీ (Strawberry): స్ట్రాబెర్రీలల్లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants)ఉంటాయి. దీన్ని తినడం వల్ల మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. దీనిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది.
అరటిపండు (Banana): భారతదేశంలో అరటిపండునే ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలుు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించేందుకు ఎంతో సహాయపడుతుంది.
కివి (Kiwi): తరచుగా బీపీ పెరిగే వారు తరచుగా కివి పండ్లను తింటే చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండు వారి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని నేరుగా తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
చిలగడదుంప (Sweet potato): ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో కరిగే ఫైబర్, బీటా కెరోటిన్, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.