మెరిసే చర్మం కోసం 4 ఫేస్ ప్యాక్స్.. ఇవి పాటిస్తే అందమే అందం!
నలుగురిలో అందంగా (Beautifully), ప్రత్యేకంగా కనిపించాలని అందరి ఆకాంక్ష. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయినా తగిన ఫలితం లభించదు.

ఇందుకోసం ఎంతో సులభంగా సహజసిద్ధమైన పద్ధతిలో ఇంటిలోనే తయారు చేసుకునే కొన్ని ఫేస్ ప్యాక్స్ (Face packs) లను ప్రయత్నిస్తే ఉత్తమైన ఫలితాలను పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మానికి తగిన పోషణ అందకపోవడంతో చర్మ సమస్యలు (Skin problems) ఏర్పడతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకాన్ని తగ్గించండి. ఇవి మీ చర్మ సహజసిద్ధమైన చర్మసౌందర్యాన్ని (Skin beauty) దెబ్బతీస్తాయి. అదే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకునే ఫేస్ ప్యాక్స్ మీ చర్మాన్ని లోపలినుంచి శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
దీంతో అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గి చర్మం మృదువుగా, కోమలంగా, అందంగా మారుతుంది. దీంతో మీ చర్మ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేని (Chemical free) కారణంగా చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవని (No side effects) సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి చర్మ సౌందర్యం కోసం వీటిని ప్రయత్నించండి.. మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి..
బొప్పాయి గుజ్జు, తేనె, పచ్చిపాలు: ఒక కప్పులో అర కప్పు బాగా పండిన బొప్పాయి గుజ్జు (Papaya pulp), ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey), రెండు స్పూన్ ల పచ్చిపాలు (Milk) పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే చర్మం పొడిబారే సమస్యలు తగ్గి చర్మం తేమగా, తాజాగా ఉంటుంది.
సెనగ పిండి, పసుపు, రోజ్ వాటర్: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల సెనగ పిండి (Gram flour), చిటికెడు పసుపు (Turmeric), కొద్దిగా రోజ్ వాటర్ (Rose water) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
సపోటా గుజ్జు, తేనె: ఒక కప్పులో సపోటా గుజ్జు (Sapota pulp), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే చర్మ కణాలలో పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
పెసర పిండి, పెరుగు, పసుపు: ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ ల పెసరపిండి (Pesarapindi), కొద్దిగా పెరుగు (Yogurt), చిటికెడు పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు సమస్యలు తగ్గి చర్మం కోమలంగా, అందంగా మెరిసిపోతుంది.