కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే చిట్కాలు ఇవిగో
life Apr 06 2026
Author: Haritha Chappa Image Credits:pixabay
Telugu
ఇలా చేయండి
మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చిన వెంటనే కుళ్లిన, పసుపు రంగు ఆకులను ముందుగా ఏరిపడేయాలి. తేమ ఉంటే కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుంది. పొడిగా ఉండేలా చూసుకోండి.
Image credits: Getty
Telugu
మస్లిన్ క్లాత్ వాడండి
కొత్తిమీరను స్టోర్ చేసేందుకు ఒక పల్చటి కాటన్ లేదా మస్లిన్ క్లాత్‌లో చుట్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల గాలి తగిలి, తేమ చేరకుండా ఉంటుంది.
Image credits: pixabay
Telugu
ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టండి
ఒక డబ్బా అడుగున టిష్యూ పేపర్ పెట్టండి. దానిపై కొత్తిమీరను ఉంచండి. మళ్లీ పైన మరో టిష్యూ పేపర్ పెట్టి, డబ్బా మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.
Image credits: pixabay
Telugu
నీళ్లలో ఇలా పెట్టండి
కొత్తిమీరను వేర్లతో పాటు నిల్వ చేయాలంటే, ఒక గ్లాసు నీటిలో దాని వేర్లు మునిగేలా ఉంచండి. ఆ తర్వాత ఆకుల భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఫ్రిజ్‌లో పెట్టండి.
Image credits: Getty
Telugu
ఇది గుర్తుంచుకోండి
మధ్యమధ్యలో ఏదైనా ఆకు పసుపు రంగులోకి మారితే, దాన్ని వెంటనే తీసేయండి. లేదంటే ఆ ఒక్క ఆకు వల్ల మిగతా ఆకులన్నీ పాడైపోతాయి.
Image credits: Getty
Telugu
వాష్ చేయకూడదు
కొత్తిమీరను నీటితో కడగకుండా స్టోర్ చేయాలి. తడిగా ఉంటే ఆకులను ఫ్రిజ్ లో పెడితే కుళ్లిపోతాయి.
Image credits: Getty
Telugu
టిష్యూ పేపర్లో
టిష్యూ పేపర్లలో పొడిగా ఉండే కొత్తిమీరను చుట్టి ఫ్రిజ్ లో నిల్వ చేయాలి.