దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని పడుకుంటే ఏమౌతుందో తెలుసా?
వెల్లుల్లిని మనం ప్రతి ఒక్క కూరలో వేస్తుంటాం. ఎందుకంటే దీనివల్ల కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే రాత్రిపూట మీరు వెల్లుల్లిని దిండుకింద పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రతి ఒక్కరూ వంటలో ఖచ్చితంగా వెల్లుల్లిని ఉపయోగిస్తారు. దీని వాసన, రుచి వంటలను మరింత టేస్టీగా చేస్తుంది. అంతేకాదు వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య జబ్బులకు దూరంగా ఉంచుతాయి. అందుకే వీటిని నేటికీ ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. నిజానికి ఆరోగ్యంగా ఉండేందుకు మీరు వీటిని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు.
కొంచెం వింతగా అనిపించినా.. ఒక పద్దతిలో వెల్లుల్లిని ఉపయోగిస్తే మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒకటి లేదా రెండు తాజా వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి దిండుకింద పెట్టుకుని పడుకోవాలి. అవును దీనివల్ల మీరు ఎన్ని ప్రయోజనాలను పొందుతారో తెలుసా?
garlic
వెల్లుల్లిని దిండుకింద పెట్టుకుని పడుకోవడం వల్ల కలిగే లాభాలు
బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా టైం కి నిద్రరాకపోవడం వల్ల ఎన్నో జబ్బుల బారిన పడుతున్నారు. కానీ ఇలాంటి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రరాక రాత్రిళ్లు బెడ్ పై అటూ ఇటూ దొర్లే వారు చాలా మందే ఉన్నారు.
ఇలాంటి వారికి వెల్లుల్లి రెబ్బలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అవును మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు దిండు కింద తొక్క తీసిన ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పెట్టుకుని పడుకోవడం అలవాటు చేసుకోండి. వెల్లుల్లిలోని ఘాటైన వాసన మీ మెదడును శాంతపరుస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
రక్షణలా పనిచేస్తుంది
వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి ఘాటైన వాసన మన శరీరానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది మనం పడుకున్నప్పుడు మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే లక్షణాలు మనల్ని బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి కాపాడుతాయి. అలాగే మన శరీరానికి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది.
దోమలు, కీటకాలు దూరంగా ఉంటాయి
రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా దోమలు కుడుతుంటాయి. దీనివల్ల నిద్రమొత్తం డిస్టబెన్స్ అవుతుంది. అయితే వీటి బెడద నుంచి వెల్లుల్లి రెబ్బలు మనల్ని రక్షించడానికి సహాయపడతాయి. అవును వెల్లుల్లి రెబ్బలను దిండుకింద పెడితే పురుగులు, దోమలు మన చుట్టు పక్కలకు అస్సలు రావు.
మన తాతలు, ముత్తాతల కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వెల్లుల్లిలోని బలమైన, ఘాటైన వాసన మనకు దోమల్ని, కీటకాల్ని దూరంగా ఉంచుతాయి. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
చెడు కలలు పడవు
అవును రాత్రి పడుకునేటప్పుడు మీరు దిండుకింద రెండు వెల్లుల్లి రెబ్బలను పెట్టుకుంటే మీకు రాత్రిళ్లు చెడు కలలు పడే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే వెల్లుల్లికి నెగిటివిటీని గ్రహించే గుణం ఉంటుందని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో మీరు దిండు కింద వెల్లుల్లిని పెట్టి నిద్రపోతే మీ చుట్టూ సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. అలాగే రాత్రిపూట చెడు ఆలోచనలు, భయం, ఆందోళనలు కలగవు.